Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చి వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు… అందులో రవితేజ ఒకరు…ఈయన చేసిన సినిమాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు తడబడుతున్నప్పటికి మంచి సక్సెస్ లను సాధించడానికి గొప్ప కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఆయన ఎక్స్పరమెంట్స్ చేసిన ప్రతిసారి పరాజయాన్ని చవిచూస్తున్నాడు. అందుకే సేఫ్ జోన్ లో ఉండడానికి కమర్షియల్ సినిమాలనే చేస్తు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…రవితేజ తన కెరియర్ లో చాలామంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు. కొత్త దర్శకులతో సినిమాలను చేసి వాళ్ళను స్టార్ డైరెక్టర్లుగా మార్చిన ఘనత కూడా రవితేజ కే దక్కుతోంది.
అలాంటి రవితేజ ఒక ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను టాప్ లెవల్ కి తీసుకెళ్ళాడు. చక్రి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్ మొదట్లో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఆ తర్వాత రవితేజ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
రవితేజ లాంటి స్నేహితుడితో నాకు పరిచయం అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయే వాడిని అంటూ చక్రి చాలా సందర్భాల్లో తెలియజేశాడు… ఇక కిక్ సినిమాతో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసిన ఘనత కూడా రవితేజ కే దక్కుతోంది. ఆ తర్వాత రవితేజ వరుసగా 6 నుంచి 7 సినిమాలకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు…
తమన్ సైతం రవితేజ లేకపోతే నేను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే వాడిని కాదు అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్లు పెను సంచలనాన్ని క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం బీమ్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ సైతం రవితేజ సినిమాలతోనే తనకి ఒక మంచి గుర్తింపు వచ్చిందని రీసెంట్గా జరిగిన మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయ్యాడు…నేను సూసైడ్ చేసుకొని చనిపోయే వాడిని అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఏడిపించాయి…మొత్తానికైతే రవితేజ ఎదుగుతూ వీళ్ళను కూడా టాప్ పొజిషన్ కి తీసుకెళ్ళాడు…