Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: ఆ ఒక్క సినిమా హిట్ అయి ఉంటే మహేష్ బాబు ను టచ్...

Mahesh Babu: ఆ ఒక్క సినిమా హిట్ అయి ఉంటే మహేష్ బాబు ను టచ్ చేసే హీరో ఉండకపోయేవారు…

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరు విజయం సాధించి టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరు డౌన్ ఫాల్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ ని సాధిస్తే చాలు టాప్ లోకి వెళ్ళిపోవచ్చు. అదే ఒక ఫ్లాప్ ని మూట గట్టుకుంటే మాత్రం పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం చాలా […]

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరు విజయం సాధించి టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరు డౌన్ ఫాల్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ ని సాధిస్తే చాలు టాప్ లోకి వెళ్ళిపోవచ్చు. అదే ఒక ఫ్లాప్ ని మూట గట్టుకుంటే మాత్రం పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ అతన్ని మాస్ హీరోగా నిలబెట్టడంలో చాలావరకు కీలకపాత్ర వహించాయి. ఒక్క సినిమా విషయంలో మాత్రం ఆయన చాలావరకు రాంగ్ స్టెప్ వేశాడని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించినప్పటికి కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ ని సాధించలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేసిన ‘వన్ నేనొక్కడినే’ మూవీ కావడం విశేషం… ఈ సినిమాలో మహేశ్ బాబు చాలా స్టైలిష్ కనిపించాడు. తను అంతకుముందు ఎప్పుడు చేయనటువంటి డ్యాన్స్ స్టెప్పులను కూడా ఈ సినిమాలో వేయడం విశేషం…

ఆ సినిమా కనక ఆడి ఉంటే మాత్రం మహేష్ బాబు కెరీర్ అనేది అమాంతం తారాస్థాయికి వెళ్లిపోయేది. ఆపాటి వరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారిపోయేది. ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న వారెవరు కూడా అతనికి పోటీగా మారేవారు కాదు.

ఎందుకంటే ఆయన ఎప్పుడో నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకునేవాడు. అంతకు ముందు కూడా డిఫరెంట్ ప్రయత్నాలు చేసిన మహేష్ బాబు చాలా సందర్భాల్లో బొక్క బోర్ల పడ్డాడు. కెరియర్ స్టార్టింగ్ లో నాని సినిమాతో ప్రయోగం చేసిన ఆయన ఆ సినిమా కూడా కలిసి రాలేదు.

దాంతో ప్రయోగాల జోలికి వెళ్లలేదు. కానీ సుకుమార్ చెప్పిన కథ బాగుండి ఎక్స్పరమెంట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అనుకున్నప్పటికి ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకవేళ ఆ సినిమా ఇప్పుడు కనక వచ్చుంటే మాత్రం ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper