https://oktelugu.com/

Tollywood Heroines: క్యాస్టింగ్ కౌచ్ కి భయపడి టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఇండస్ట్రీ కి రావడం లేదా..?

రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ స్పందిస్తు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే అన్నింటికీ లొంగిపోయి ఉండాలి అంటూ అప్పట్లో ఆమె మాట్లాడిన మాటలు ఒక పెను సంచలనాన్ని సృష్టించాయి.

Written By:
  • Gopi
  • , Updated On : February 10, 2024 / 08:47 AM IST

    Tollywood Heroines

    Follow us on

    Tollywood Heroines: సినిమా ఇండస్ట్రీలో హీరోలా పరిస్థితి ఎలా ఉన్నా కూడా హీరోయిన్లు మాత్రం కొంతవరకు ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటూన్నారు అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇక దీనికి తగ్గట్టుగానే రీసెంట్ గా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్లను, సైడ్ ఆర్టిస్టులను వేధిస్తున్నారు అంటూ చాలా మంది మీడియా ముందుకు వచ్చారు. ఇక వాటికి సంబంధించిన వీడియోలను కూడా కొంతమంది రిలీజ్ చేశారు.

    అయితే నిజంగానే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందా? అనే దాని మీద కూడా చాలా కథనాలు వెలువడ్డాయి. అయితే కొద్దిరోజుల క్రితం దీని మీద సీనియర్ హీరోయిన్ అయిన రమ్య కృష్ణ లాంటి వారు సైతం స్పందించడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.

    ఈ విషయం మీద రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ స్పందిస్తు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే అన్నింటికీ లొంగిపోయి ఉండాలి అంటూ అప్పట్లో ఆమె మాట్లాడిన మాటలు ఒక పెను సంచలనాన్ని సృష్టించాయి. ఇక ఇది ఇక ఉంటే ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుంది. కానీ అందరి విషయంలో జరగడం లేదు కొంతమంది విషయంలో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటూ మరి కొంతమంది సీనియర్ హీరోయిన్లు సైతం స్పందించారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లందరూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని వచ్చిన వాళ్లే అంటూ మరి కొంత మంది సీనియర్ హీరోయిన్లు సైతం యంగ్ హీరోయిన్ల మీద ఇన్ డైరెక్ట్ గా కామెంట్లను చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వార్తలైతే ఇండస్ట్రీ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తెర మీదకి వస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు వచ్చే అప్ కమింగ్ హీరోయిన్లను కు కూడా కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ గాని, వేధింపులు గొలిపే కాల్స్ గానీ వస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు గానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిదని సినీ పెద్దలు సైతం జాగ్రత్తలు చెప్తున్నారు…అయితే హీరోయిన్లు అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్ కి భయపడి చాలా మంది ఇండస్ట్రీ కి రావడం లేదు. దానివల్ల టాలెంట్ ఉన్న నటీమణులు ఇండస్ట్రీ లో కనిపించడం లేదు…