Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు లేని హీరోలు సైతం ఇప్పుడు వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం ప్రతి ఒక్కరిని ఆనందంపోజేస్తుంది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలైతే ఈ సంవత్సరం విజయాల బాట పట్టారు. ఈ సంవత్సర సంక్రాంతి కానుకగా శర్వానంద్ హీరోగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో శర్వానంద్ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఆ తర్వాత బైకర్ సినిమాని సైతం రిలీజ్ చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది. అఖిల్ లాంటి హీరో సైతం ‘లెనిన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సంవత్సరం అక్కినేని అఖిల్ సైతం విజయాన్ని సాధించాడు. నిజంగా ఇది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక అక్కినేని అభిమానులనైతే విపరీతంగా ఆనందింపజేసే విషయమనే చెప్పాలి… సెప్టెంబర్ నెలలో ‘రణబాలి’ సినిమాతో విజయ్ దేవరకొండ సైతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
గతంలో ఆయన చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్ సినిమాలు నిరుత్సాహపరిచాయి. కాబట్టి ఈ సంవత్సరం ఎలాగైనా సరే రణబాలి సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా కోసం అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… మొత్తానికైతే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నాడంటు అభిమానులు భావిస్తున్నారు…
ఇక కిరణ్ అబ్బవరం సైతం గత సంవత్సరం కే ర్యాంప్ సినిమాతో సక్సెస్ ని సాధించిన కూడా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. కే ర్యాంప్ సినిమా ఒకే అనిపించుకున్నప్పటికి క రేంజ్ కలెక్షన్స్ రాలేదు. క సినిమా భారీ కలెక్షన్స్ సాధించకపోవడంతో చెన్నై లవ్ స్టోరీ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

