Tollywood 2027: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియాలో వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే టైర్ వన్ హీరోలుగా వెలుగొందుతున్న ప్రతి హీరో రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడం విశేషం… 2026 వ సంవత్సరం సగం పూర్తయింది. కాబట్టి మరొక సగం సంవత్సరంలో ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది మాత్రం స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతుంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మార్చి 5వ తేదీన రాబోతుంది. కాబట్టి ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసే అవకాశమైతే ఉంది. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా సైతం ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి జక్కన్న తన మార్క్ ను చూపించబోతున్నాడు.
ఆ తర్వాత జూలై నెలలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా రాబోతుంది. ఈ మూడు సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తాయని ప్రతి ఒక్క అభిమాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాయి. ప్రేక్షకులందరిలో విశేషమైన అంచనాలు రాబడతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలతో పాటుగా అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న రాకా సినిమా సైతం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.
ఈ రకంగా చూసుకుంటే 2027 వ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద భారీ సినిమాలైతే రాబోతున్నాయి. ఆ సంవత్సరం దాదాపు పదివేల కోట్ల వరకు బిజినెస్ అయితే జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి…స్టార్ హీరోలతో పాటుగా మీడియం రేంజ్ హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచే అవకాశాలైతే ఉన్నాయి…
