Sri Anjaneyam: శ్రీ ఆంజనేయం సినిమా లో ఆ ఒక్క సీన్ లేకపోతే హను మాన్ సినిమా కంటే పెద్ద హిట్ అయ్యేదా..?

నితిన్ ని హీరోగా పెట్టి ఆయన చేసిన శ్రీ ఆంజనేయం సినిమా దైవభక్తితో తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడం లో కొంతవరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : February 10, 2024 8:56 am
Follow us on

Sri Anjaneyam: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన తనదైన మార్కు చూపిస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, మురారి లాంటి సినిమాలు అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి.

అయితే నితిన్ ని హీరోగా పెట్టి ఆయన చేసిన శ్రీ ఆంజనేయం సినిమా దైవభక్తితో తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడం లో కొంతవరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఉన్న స్సాంగ్స్ గాని, డైలాగ్స్ గాని సినిమాలో చూపించిన సీన్స్ గాని ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ సాధించలేదు.

దానికి కారణం ఏంటి అంటే దైవభక్తితో తెరకెక్కిన ఈ సినిమాలో ఛార్మి చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకటి ఈ సినిమాకి మైనస్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ కూడా ఎక్కువైంది, ఇక ఒక సీన్ లో అయితే చార్మికి పాము కుడితే హీరో తన నోటితో ఆ విషాన్ని తీయడం అనేది ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పంటి కింద రాయలా తయారైందనే చెప్పాలి. ఈ సినిమాని దైవభక్తితో చూసే ప్రేక్షకులు మధ్యలో వచ్చే రొమాన్స్ సీన్ల ను చూడలేక ఆ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. లేకపోతే రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో , శ్రీ ఆంజనేయం సినిమా కూడా అప్పట్లో అంతే పెద్ద సక్సెస్ సాధించేదని ఇప్పటికీ చాలామంది సినిమా విమర్శకులు సైతం ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.

ఇక రీసెంట్ గా ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో హీరో అయిన నితిన్ కూడా తనకు ఇష్టమైన సినిమాల్లో శ్రీ ఆంజనేయం సినిమా ఒకటిని చెప్పాడు. మళ్ళీ రీమేక్ చేయాల్సిన అవకాశం వస్తే ఆ సినిమాని తప్పకుండా రీమేక్ చేస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆ సినిమాలో ఒకటి రెండు చిన్న మిస్టేక్స్ ఉండటం వల్ల ఆ మూవీ పెద్దగా విజయం సాధించలేకపోయింది కానీ, ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ సినిమాని రీమేక్ చేస్తే మాత్రం ఆ మూవీ సూపర్ సక్సెస్ అవుతుందంటూ తను చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…