Mahesh Babu And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ కి ఉన్న గుర్తింపు వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళ సినిమాలకి వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు వీళ్ళతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు కూడా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండేవారు. నిజానికి వీళ్ళ స్టార్డమ్ తో ఏవరేజ్ సినిమాలని కూడా ఈజీగా సక్సెస్ తీరాలకు చేరుస్తారు. వీళ్ళ సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఆ సినిమాలు ఈజీగా భారీ కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు మాస్ డైరెక్టర్లు వీళ్ళతో సినిమాలు చేయాలని ప్రయత్నం చేసి చివరికి చేయలేకపోయారు. అందులో మొదటగా వివి వినాయక్ గురించి చెప్పాలి. వినాయక్ వీళ్లిద్దరితో సినిమాలు చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేసినప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు. నిజానికి ఆయన ఎన్టీఆర్ తో చేసిన ‘అదుర్స్ ‘ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు తో ఒక భారీ సినిమా చేయడానికి తను ఫిక్స్ అయ్యాడు. స్టొరీ కూడా ఫైనలైజ్ అయింది. అయినప్పటికీ ఆ సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు…ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో ‘నాయక్ ‘ సినిమా చేసి సూపర్ సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక హై వోల్టేజ్ మాస్ సినిమాని చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కానీ ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో మెటిరియాలైజ్ అయితే అవ్వలేదు. కాబట్టి ఈ సినిమాని పక్కన పెట్టేసారు…
ఇక వినాయక్ తో పాటుగా మరొక మాస్ డైరెక్టర్ కూడా వీళ్ళిద్దరితో సినిమాలు చేయడానికి తెగ ప్రయత్నం చేశాడు. ఆయన ఎవరు అంటే బోయపాటి శీను… అవును మీరు విన్నది నిజమే.. బోయపాటి శ్రీను మాస్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్.. ముఖ్యంగా బాలయ్య బాబుతో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబడుతూ ఉంటాయి. ఇక ‘సరైనోడు ‘ సినిమా కథని మహేష్ బాబు తో చేయాలని బోయపాటి తీవ్రమైన ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు.
ఇక ఈ సినిమాని అల్లు అర్జున్ తో చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. బోయపాటి సీనియర్ హీరోలకి మంచి విజయాలను అందిస్తాడు.
కానీ ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలకి సక్సెస్ ని అందించలేడు అనే ఒక బ్యాడ్ నేమ్ అయితే ఆయన మీద ఉంది. దానివల్లే ఈ హీరోలు అతనితో సినిమాలు చేయలేకపోయి ఉండొచ్చేమో అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…