Realme Mobile : 5 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్.. రియల్ మీ తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీపై స్పెషల్ స్టోరీ

చైనాకు చెందిన రియల్మీ కంపెనీ తాజాగా 320 వాట్స్ సూపర్సోనిక్ ఛార్జ్ సోల్యూషన్ ను ప్రవేశపెట్టింది. దీనిని ఆగస్టు 14న లాంచ్ చేశారు. గతంలో ఈ టెక్నాలజీకి చెందిన ఓ టీజర్ ను రిలీజ్ చేసింది. దీంతో అందరూ 330 వాట్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుందని అనుకున్నారు. కానీ కంపెనీ చెప్పిన ప్రకారం 32 వాట్స్ లాంచ్ అయింది.

Written By: Chai Muchhata, Updated On : ఆగస్ట్ 14, 2024 1:28 సా.

Realme Fast Charging

Follow us on

Realme Mobile : కాలం మారుతున్న కొద్దీ మొబైల్ టెక్నాలజీ మారుతోంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. చైనాకు చెందిన కొన్ని ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి. వీటిలో రియల్మీ కంపెనీకి చెందిన కొన్ని మోడళ్లు ఇప్పటికే వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఫాస్టెస్ట్ రీచార్జ్ మొబైల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీని మొబైల్ లో ప్రవేశపెడితే కేవలం 5 నిమిషాల్లో 100 శాతం పూర్తవుతుంది. ఇప్పటి వరకు షావోమీ కంపెనీకి చెందిన ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీకి గట్టి పోటీ ఇస్తూ అప్డేట్ వెర్షన్ తో వచ్చిన దీని గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్లండి..

చైనాకు చెందిన రియల్మీ కంపెనీ తాజాగా 320 వాట్స్ సూపర్సోనిక్ ఛార్జ్ సోల్యూషన్ ను ప్రవేశపెట్టింది. దీనిని ఆగస్టు 14న లాంచ్ చేశారు. గతంలో ఈ టెక్నాలజీకి చెందిన ఓ టీజర్ ను రిలీజ్ చేసింది. దీంతో అందరూ 330 వాట్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుందని అనుకున్నారు. కానీ కంపెనీ చెప్పిన ప్రకారం 32 వాట్స్ లాంచ్ అయింది. ఇది అప్డేట్ చేసిన టెక్నాలజీ. అంతేకాకుండా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

రియల్మీ చెప్పిన ప్రకారం దీనిని మొబైల్ లో ప్రవేశపెడితే 37 సెకన్లలో 17 శాతం ఛార్జింగ్ అవుతుంది. మూడు నిమిషాల్లో 50 శాతం.. 5 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం కాలం చాలా మొబైల్స్ ఛార్జర్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఫోన్లు గంటల తరబడి ఛార్జింగ్ పెడితే తప్ప 100 శాతం పూర్తి కావడం లేదు. దీంతో కొంత సమయం మొబైల్ కారణంగా వృథా అవుతుంది. అటువంటి వారికి ఈ టెక్నాలజీ ఉపయోగడపడుతుందని అంటున్నారు.

అయితే రియల్మీ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ 2 నిమిషాల్లో 4100 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా 50 శాతం పూర్తవుతుంది. 4600 బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ 80 సెకన్లలో 20 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఈ టెక్నాలజీ రాకతో మొబైల్స్ ఛార్జింగ్ సమస్యకు వీడ్కోలు పలుకుతాయని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు షావోమీ కంపెనకి 240 వాట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కానీ రియల్మీ 320 వాట్స్ తో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే గత ఏడాది లాంచ్ చేసిన జీటీ 5 మొబైల్స్ లో ఈ టెక్నాలజీని లాంచ్ చేశారు.

మొదట చైనాలో లాంచ్ చేసిన ఈ టెక్నాలజీ ఆ తరువాత వచ్చే మొబైల్స్ లో అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రియల్మీ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే వాటిలో ఇది కనిపించే అవకాశం ఉంది. ఫాస్టెస్ట్ ఛార్జర్ కావాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు. అయితే ఈ టెక్నాలజీ భారత్ లో ఎప్పుడు ప్రవేశపెడుతారో చూడాలి.