Mahesh Babu: మహేష్ బాబు ఆ స్టార్ డైరెక్టర్ తో చేసిన సినిమాకి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట…కారణం ఏంటంటే..?

స్టార్ హీరోలు చేసిన కొన్ని మంచి పనులు ఎప్పుడు సెన్సేషన్ అవుతూ ఉంటాయి...వాళ్ళు అలా చేయడం వల్ల సమాజం లో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి...ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళను ప్రతి విషయం లో ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే మంచి లో కనీసం కొంతైనా వీళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది...

Written By: Gopi, Updated On : ఆగస్ట్ 14, 2024 1:43 సా.

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య అయిన రమేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన సినిమాల్లో అంత బాగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఆయన సాధించలేని స్టార్ డమ్ ను మహేష్ బాబు సాధించి కృష్ణ నట వారసుడి గా ఎదిగాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ‘మురారి ‘.. కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. మహేష్ బాబు మొదటిసారి ఒక ఫ్యామిలీ సబ్జెక్టు చేయడమే కాకుండా ఈ సినిమాలో తనలోని ప్యూర్ ఎమోషన్స్ ను చూపిస్తూ ముందుకు తీసుకెళ్లాడు. తన నటన ఈ సినిమాతో మరొకసారి హైలైట్ అయిందనే చెప్పాలి. ఇక ఎప్పుడైతే ఆయన ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడో మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మరొకసారి ఫ్యామిలీ సబ్జెక్టుతో సినిమా చేయాలని కృష్ణ అనుకున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం మళ్లీ ఫ్యామిలీ సినిమా వద్దని చెప్పి కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో జయంత్ సి పరాంజి చెప్పిన ‘టక్కరి దొంగ’ సినిమాని చేశాడు. ఇక ఈ సినిమా సమయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మహేష్ బాబు ఈ సినిమాకోసం చాలా వరకు డూప్ లేకుండా స్టంట్స్ చేస్తూ కష్టపడ్డాడు…

దీని కోసం ఎన్నో రిస్కీ షాట్స్ ని కూడా తను చేశాడు. అయినప్పటికీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోవడం నిజంగా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. అయితే మహేష్ బాబు ఈ సినిమా చేస్తున్న సమయంలో ఈ సినిమాకి దర్శకుడు, ప్రొడ్యూసర్ జయంత్ గారు ఒక్కరే కావడం వల్ల ఆయన చాలాసార్లు మహేష్ బాబు కి రెమ్యూనరేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారట. కానీ మహేష్ బాబు మాత్రం తను తీసుకోలేదట ఎందుకు అంటే ఒక దర్శకుడు ప్రొడ్యూసర్ గా మారి సినిమా చేస్తున్నాడు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి అని ఆలోచించాడట.

ఇక దానికోసమే తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా సినిమా మీద పెట్టి సినిమా బాగా వచ్చే విధంగా తీర్చిదిద్దండి అని చెప్పారట. ఇక సినిమా సక్సెస్ అయ్యక రెమ్యూనరేషన్ తీసుకుంటానని కూడా చెప్పడంతో జయంత్ ఆయన వ్యక్తిత్వానికి చాలా సంబరపడిపోయాడట. ఇక సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీర్చిదిద్దినప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేకపోయింది…

ఫైనల్ గా మహేష్ బాబు కెరియర్ లో ఒక భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ మహేష్ బాబు జయంత్ సి పరంజి ని ఏమి అనలేదు. ఇక రెమ్యూనికేషన్ ని కూడా తను ఇస్తానన్నా కూడా మహేష్ బాబు తీసుకోలేదట… ఇక ఈ విషయాన్ని జయంత్ గారే చెప్పడం విశేషం… ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులందరు తమ హీరో స్టార్ డమ్ లోనే కాదు, వ్యక్తిత్వం లో కూడా టాప్ లెవల్లో ఉంటాడు అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు…