Telugu Heroes Market: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను మినహాయిస్తే మీడియం రేంజ్ హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు టైర్ వన్ హీరోలుగా మారడానికి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళతో పోలిస్తే తమిళంలో ఉన్న ధనుష్ మలయాళం లో ఉన్న దుల్కర్ సల్మాన్ లకు భారీ మార్కెట్ అయితే ఉందని వాళ్లతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు సైతం మొదట నానితో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి సినిమాలను చేయాలని అనుకున్నాడు.
కానీ నాని ఆ కథలను రిజెక్ట్ చేయడంతో ఆయన ధనుష్, దుల్కర్ సల్మాన్ లను పెట్టి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అలాంటి సినిమాలను వదులుకున్నందుకు నాని మీద చాలామంది విమర్శలైతే చేశారు. ఇక ఏది ఏమైనా కూడా మన హీరోల కంటే కూడా ఇతర భాషల హీరోలకే ఎక్కువగా మార్కెట్ ఉందని మరోసారి వాళ్లు ప్రూవ్ చేశారు…
హీరోలు కథల విషయంలో వేలు పెట్టడం వల్ల కథలు చెడిపోతున్నాయనే ఉద్దేశ్యంతో కూడా కొంతమంది దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. వాళ్లకు పాన్ ఇండియాలో సక్సెస్ లను అందిస్తున్నారు. కానీ మనవాళ్లు మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తూ, సక్సెస్ లను సాధిస్తూ ఇక్కడికే పరిమితమవుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఫ్యూచర్లో వీళ్ళు పాన్ ఇండియా సినిమాలను చేసి భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇతర భాషల హీరోలతో పోలిస్తే మన హీరోలకు ఏం తక్కువ అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మన వాళ్లకు కథల్లో వేలు పెట్టడం, దర్శకులను సరిగ్గా డైరెక్షన్ చేయకుండా ఇబ్బంది పెట్టడం లాంటి విషయాల్లో వేలు పెడుతుంటారు. అందువల్లే మన హీరోలు ప్లాప్ లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది…