Homeఎంటర్టైన్మెంట్'చరణ్'తో అంజలి.. మరీ కెరీర్ సెట్ అవుతుందా ?

‘చరణ్’తో అంజలి.. మరీ కెరీర్ సెట్ అవుతుందా ?

‘అంజలి’ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అచ్చ తెలుగు హీరోయిన్ గా అంజలికి మంచి గుర్తింపు వచ్చింది. కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ చిన్న సినిమాల హీరోయిన్ గా కూడా ఆమెకు ప్రస్తుతం స్టార్ స్టేటస్ లేకుండా పోయింది. వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన నటించినా.. అంజలికి ఎక్కడా బ్రేక్ రాలేదు. ఇప్పుడు ఆ సీనియర్ హీరోలు కూడా ఆమెకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. దాంతో పవర్ […]

Anjali Got A Chance With Ramcharan‘అంజలి’ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అచ్చ తెలుగు హీరోయిన్ గా అంజలికి మంచి గుర్తింపు వచ్చింది. కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ చిన్న సినిమాల హీరోయిన్ గా కూడా ఆమెకు ప్రస్తుతం స్టార్ స్టేటస్ లేకుండా పోయింది. వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన నటించినా.. అంజలికి ఎక్కడా బ్రేక్ రాలేదు.

ఇప్పుడు ఆ సీనియర్ హీరోలు కూడా ఆమెకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఒక క్యారెక్టర్ చేసింది. ఆ సినిమా తర్వాత తనకు వరుస అవకాశాలు వస్తాయని నమ్మిన అంజలికి చివరకు నిరాశే మిగిలింది .ఆశించిన స్థాయిలో ఆమెకు ఛాన్స్ లు రాలేదు. ఇక ఎదురు చూసి చూసి విసిగిపోయిన అంజలి, సైడ్ క్యారెక్టర్స్ కి కూడా తాను సిద్ధం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది.

మొత్తానికి రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ప్లాన్ చేసిన సినిమాలో ఒక కీలక పాత్రలో అంజలి నటించనుంది. కాకపోతే హీరోయిన్ గా కాదు. విలన్ భార్యగా అంజలి నటిస్తోంది. ఐతే హీరోయిన్ కి సమాంతరంగా అంజలి పాత్ర ఉందట. మొదట ఆ పాత్రలో త్రిషను తీసుకోవాలనుకున్నారు.

కానీ త్రిష ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో ఇప్పుడు ఈ పాత్రలో అంజలిని తీసుకున్నారు. ఆల్ రెడీ అంజలి అనేక తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె మంచి నటి గనుకే శంకర్ ఆమెకు ఈ అవకాశం ఇచ్చాడు. మరి అంజలి కెరీర్ చరణ్ సినిమాతోనైనా మళ్ళీ పుంజుకుంటోందా ? అసలుకే అంజలికి ‘ఆంటీ’ పాత్రలే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి, ఆమె కెరీర్ కి చరణ్ – శంకర్ సినిమా అత్యంత కీలకం కానుంది.

ఇక ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమాలో చరణ్ ది డ్యూయల్ రోల్. అందులోనూ ఒక రోల్ ఫాదర్ క్యారెక్టర్, మరి ఆ పాత్రలో చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper