
మెగా స్టార్ చిరంజీవి అండతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఏకంగా 10 మంది వరకు మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ప్రధానంగా రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శీరీష్ లు ప్రధానంగా యాక్టివ్ గా ఉన్నారు. ఇక చిరంజీవి అల్లుడు, ఆయన సోదరి కుమారుడు సైతం ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు. చిరంజీవి స్వయంకృషితో హీరోగా ఎదగగా.. దాదాపు 10 మంది ఆయన చెట్టు నీడలో ఎదుగుతున్నారు.
అయితే మెగాస్టార్ తో సరిసమానంగా క్రేజ్ సంపాదించుకుంది ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్. పవన్ కు అందరి హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చిరంజీవి కంటే కూడా అభిమానులు పవన్ ను అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. పవన్ ఏ విషయమైనా వైరల్ అవుతుంటుంది.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో దుమారం రేపుతోంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి మధ్యలో ఠీవీగా నిలబడి ఉండగా.. మధ్యలో చుట్టూ మెగా హీరోలందరినీ నాగబాబు పెట్టాడు. ఈ ఫొటోలో ఉన్న యంగ్ హీరోలందరికంటే అన్నయ్య చిరంజీవియే యంగ్ గా కనిపిస్తున్నాడని నాగబాబు కామెంట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన జనరేషన్ కానీ.. రాబోయే జనరేషన్ లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా అంటూ తన అన్న చిరంజీవిపై అభిమానాన్ని నాగబాబు చాటుకున్నాడు.
అయితే నాగబాబు షేర్ చేసిన ఫొటోలో పవన్ కళ్యాణ్ ను మిస్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఈ పోస్ట్ కు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ ను కావాలనే మిస్ చేశాడా? లేక పవన్ కూడా యంగ్ అండ్ చార్మ్ అని నాగబాబు వదిలేశాడా? అన్నది తేలాల్సి ఉంది.
మొత్తంగా ప్రస్తుతం చిరంజీవి న్యూ లుక్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CSb2QqQMm-A/?utm_source=ig_web_copy_link