Homeఎంటర్టైన్మెంట్Husharu 2 Teaser: 'హుషారు 2' టీజర్ వచ్చేసింది..ఆర్ నారాయణమూర్తి లో ఈ యాంగిల్ ఊహించలేదు!

Husharu 2 Teaser: ‘హుషారు 2’ టీజర్ వచ్చేసింది..ఆర్ నారాయణమూర్తి లో ఈ యాంగిల్ ఊహించలేదు!

Husharu 2 Teaser: యూత్ ఆడియన్స్ ని విశేషంగా అలరించిన సినిమాల్లో ఒకటి ‘హుషారు’. 2018 వ సంవత్సరం , డిసెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లోనే ఆడింది, కానీ ఓటీటీ లో విడుదలయ్యాక అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఖాళీ సమయం లో ఈ సినిమాని అధికంగా చూస్తుంటారు. అంతటి రెస్పాన్స్ […]

Husharu 2 Teaser: యూత్ ఆడియన్స్ ని విశేషంగా అలరించిన సినిమాల్లో ఒకటి ‘హుషారు’. 2018 వ సంవత్సరం , డిసెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లోనే ఆడింది, కానీ ఓటీటీ లో విడుదలయ్యాక అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఖాళీ సమయం లో ఈ సినిమాని అధికంగా చూస్తుంటారు. అంతటి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా ‘హుషారు 2’ తెరకెక్కింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి లోపు విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.

మొదటి భాగం లాగానే ఈ చిత్రం కూడా ఫుల్ మోడ్ లో తీసినట్టు టీజర్ ని చూస్తుంటే అనిపిస్తోంది. ‘అడవిలో అరుపులు’ అనే సినిమా తీస్తున్న సమయం లో హీరోలందరూ అడవిలో చిక్కుకోవడం, ఆ తర్వాత వాళ్లకు ఎదురైనా సందర్భాలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో ఆర్ నారాయణమూర్తి కీలక పాత్ర పోషించాడు అనే విషయం నిన్న టీజర్ ని చూసేంత వరకు ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు నారాయణమూర్తి తన సినిమాలు తప్ప, బయట సినిమాల్లో నటించడానికి ఎలాంటి ఆసక్తి చూపించేవాడు కాదు. టెంపర్ చిత్రం లో పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ ని నారాయణ మూర్తి కోసమే డిజైన్ చేసాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన్ని ఆ పాత్ర చేయాల్సిందిగా ఎంత రిక్వెస్ట్ చేసినా మూర్తి చెయ్యలేదు. అలాంటి మంచి పాత్రని కూడా వదిలేసినా ఆర్ నారాయణ మూర్తి , ‘హుషారు 2’ చేయడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్ నారాయణ మూర్తి పాత్రలు మొత్తం విప్లవాత్మకంగా ఉంటాయి కాబట్టి , అదే తరహా పాత్ర రావడంతో ఒప్పుకొని ఉండొచ్చని అంటున్నారు విశేల్షకులు. అయితే టీజర్ మొత్తానికి ఆయనే హైలైట్ గా నిలిచాడు. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అతను ఒక మంచి నటుడని , ఇకపై రాబోయే సినిమాల్లో కూడా నారాయణమూర్తి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఓవరాల్ గా మంచి ఫన్ తోనే ఈ చిత్రాన్ని నింపేసినట్టుగా అనిపిస్తోంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే ఈ ఏడాది మరో భారీ హిట్ టాలీవుడ్ ఖాతాలో పడినట్టే అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper