Auto Ramprasad: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో ఒకరు ఆటో రామ్ ప్రసాద్. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా రామ్ ప్రసాద్ సంపాదించిన క్రేజ్ మామూలుది కాదు. ఈయన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లి , అసలు గేమ్ ఆడకుండా సైలెంట్ గా కూర్చున్నా కూడా టాప్ 5 కి వెళ్ళిపోతాడు , గేమ్స్ బాగా ఆడితే టైటిల్ కూడా గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత సమీకరణాలు మొత్తం మారిపోయాయి. రామ్ ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు , గేమ్స్ అద్భుతంగా ఆడుతున్నాడు , అందరితో చాలా బాగున్నాడు , అయినప్పటికీ ఆయనకు కావాల్సిన హైప్ రావడం లేదు. టాప్ 5 లో ఉంటాడని అంతా అనుకున్నారు , కానీ కట్ చేస్తే నరేష్ కంటే ముందు ఈయనే ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.
ఇంత బాగా ఆడినా రామ్ ప్రసాద్ కి ఓటింగ్ పెరగకపోవడానికి ముఖ్య కారణం పీఆర్ టీం. ఇప్పుడు పీఆర్ టీం ఓటింగ్ విషయం లో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వని కంటెస్టెంట్స్ ని కూడా పీఆర్ టీం లేని పోనీ న్యారేటివ్స్ ని జనాల్లోకి రుద్ది ఓట్లు పడేలా చేసుకుంటూ ఉంటారు. కానీ రామ్ ప్రసాద్ కి అలాంటి పీఆర్ టీం లేదు.గత వారం ఆయన టాస్కులు అద్భుతంగా ఆడాడు. రెడ్ లెవెల్ నుండి ఎల్లో లెవెల్ కి వెళ్లి , గ్రీన్ లెవెల్ కి చేరుకోవడం లో జస్ట్ మిస్ అయ్యాడు. అలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ కూడా రామ్ ప్రసాద్ కి సోషల్ మీడియా లో ఎలివేషన్స్ ఇవ్వడం లో విఫలం అవుతున్నారు ఆయన పీఆర్ టీం. బరువులు మోసే టాస్క్ లో 52 కేజీలు మోశాడు , చివరి వరకు ఉన్నాడు , త్రిగున్ గ్రాఫ్ ని ఓవర్ నైట్ లో మార్చిన టాస్క్ ఇది.
అలాంటి టాస్క్ ద్వారా కూడా రామ్ ప్రసాద్ క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు. ఆయన పీఆర్ టీం ఎందుకో ఇవన్నీ ఎలివేట్ చేయడం లో విఫలం అవుతుంది అనే చెప్పాలి. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన రామ్ ప్రసాద్ డేంజర్ జోన్ లో ఉన్నాడంటే మీరు నమ్ముతారా ?, కానీ నిజంగానే ఆయన ఉన్నాడు. రామ్ ప్రసాద్ , వర్షిణి ,వంశీ ఈ ముగ్గురికి తక్కువ ఓటింగ్ నమోదు అవుతోంది. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వర్షిణి ని బిగ్ బాస్ టీం వెళ్లనిచ్చేలా లేరు , ఆమె జాకీలు పెట్టి లేపడానికి ప్రతీ వారం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎలిమినేషన్ రౌండ్ వరకు వస్తే వాళ్ళు వర్షిణి ని సేవ్ చేయడానికే చూస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి .