Homeఎంటర్టైన్మెంట్Animal Park Movie: 'అనిమల్ పార్క్' మూవీ లో రన్బీర్ కపూర్ కాకుండా ఆ స్టార్...

Animal Park Movie: ‘అనిమల్ పార్క్’ మూవీ లో రన్బీర్ కపూర్ కాకుండా ఆ స్టార్ హీరో…

Animal Park Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడానికి […]

Animal Park Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన లాంటి దర్శకుడు మరొకరు ఉండరు అంటూ చాలా మంది గొప్ప దర్శకులు అతనికి కితాబ్ ఐతే ఇచ్చారు. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలా విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభాస్ తో డిఫరెంట్ జానర్ లో సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటూన్నాడు. ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ సైతం తొందర్లోనే ఫినిష్ చేసి ఎలాగైనా సరే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన అనిమల్ పార్క్ సినిమాని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నాడు.

‘అనిమల్ పార్క్’ మూవీలో రన్బీర్ కపూర్ కాకుండా మరో హీరో నటించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో చేయాలనే ఆలోచనలో సందీప్ రెడ్డివంగా ఉన్నారట. అనిమల్ లో రన్బీర్ కపూర్ అద్భుతంగా నటించాడు.

ఇక ఆ నటనని అల్లు అర్జున్ బీట్ చేయగలుగుతాడా అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే అనిమల్ పార్క్ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నాడా? లేదంటే రూమర్లు వస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ‘అనిమల్ పార్క్’ సినిమా ఎప్పుడు వచ్చినా సరే చూడడానికి ప్రేక్షకులైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందులో హీరో ఎవరు అనేది డిసైడ్ కావాల్సి ఉంది. నిజానికి సందీప్ రెడ్డివంగా తలుచుకుంటే ఏ హీరో నైనా సరే అంతే వైల్డ్ గా చూపించగలరు.

మరి అలాంటి క్రమంలో సందీప్ రెడ్డి రన్బీర్ ను కాకుండా అల్లు అర్జున్ ను కనక పెట్టి సినిమా తీసినట్లయితే మాత్రం మార్కెట్ పరంగా ఈ సినిమా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సినిమా ను ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. చూడాలి మరి నిజంగానే సందీప్ రెడ్డివంగా అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయగలుగుతాడా? లేదంటే రణ్బీర్ కపూర్ ను పెట్టి ఈ సినిమాని కంప్లీట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper