Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి - వెంకటేష్ మూవీలో కన్నడ సూపర్ స్టార్...ఇద్దరి...

Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి – వెంకటేష్ మూవీలో కన్నడ సూపర్ స్టార్…ఇద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉందిగా…

Anil Ravipudi And Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది కమర్షియల్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం ఆయన క్రేజ్ తారా స్థాయిలో ఉంది. ఇప్పటికే ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. కాబట్టి ఇక మీదట తనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వెంకటేష్, […]

Anil Ravipudi And Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది కమర్షియల్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం ఆయన క్రేజ్ తారా స్థాయిలో ఉంది. ఇప్పటికే ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. కాబట్టి ఇక మీదట తనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. నిజానికి అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు పండగ వాతావరణం తలపిస్తుంది. సంక్రాంతి సీజన్ లో ప్రతి ఒక్కరు అతని సినిమాలను చూసి సూపర్ సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహిస్తున్నారని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతున్నారు. మొత్తానికైతే 2027 సంక్రాంతి కానుకగా మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి పెద్ద సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాలోకి కన్నడ సూపర్ స్టార్ అయిన మరొక హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్ కి శివన్న కి మధ్య ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందట. ఇప్పటికే ఆయన రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమాలో చరణ్ కి కోచ్ గా కనిపించాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు. ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్నప్పటికి అనిల్ తెలుగుకే మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఎందుకని ఆయన కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలు చేయడం తనకు చేతకాదా లేదంటే చేసే ఉద్దేశ్యం లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper