సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదట. అయితే, ఆ పాత్రలో మొదట చాలమందిని అనుకున్నా.. చివరకు ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారు. మొదట అనిల్ ఒప్పుకోకపోయినా.. నమ్రతా బలవంతంతో అంగీకరించాడట. కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ అయిన అనిల్ కపూర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది
Also Read: బాలయ్యా.. ఓవర్ బడ్జెట్ అయ్యా !
కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి నుంచి జరగాలి, కానీ షెడ్యూల్ వాయిదా పడింది. దాంతో దర్శకుడు స్క్రిప్టుని మరింత పర్‌ఫెక్ట్ గా తీర్చిదిద్దుకోవడానికి కథలో కొన్ని కీలకమైన మార్పులు చేశాడు. ఈ కథ మహేష్ కి తొలిసారి వినిపించేటప్పుడు ఇదో రివైంజ్ స్టోరీ. అంటే, తన తల్లిని మోసం చేసిన ఓ వైట్ కాలర్ నేరస్థుడ్ని పట్టుకోవడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది మెయిన్ పాయింట్ అట, కాకపోతే ఇప్పుడు ఈ పాయింట్ మార్చారని సమాచారం. పైగా వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.
Also Read: పారితోషకంలోనూ ట్రెండ్ సృష్టించిన పవర్ స్టార్ !
ఏది ఏమైనా ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథకు సంబంధించిన అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అన్నట్లు ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్