https://oktelugu.com/

వాట్సాప్ ఉపయోగిస్తున్నారా.. ఈ సెట్టింగ్స్ చేస్తే యాప్ భద్రం..?

ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో యూజర్లు ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా మెసేజ్ లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసే అవకాశంతో పాటు యాప్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ సేవలను వినియోగించుకోవడానికి ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే. Also Read: అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. వాటిపై భారీ డిస్కౌంట్లు పొందే ఛాన్స్..! […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2021 / 05:03 PM IST
    Follow us on

    ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో యూజర్లు ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా మెసేజ్ లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసే అవకాశంతో పాటు యాప్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ సేవలను వినియోగించుకోవడానికి ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే.

    Also Read: అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. వాటిపై భారీ డిస్కౌంట్లు పొందే ఛాన్స్..!

    అయితే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ ను తీసుకొచ్చింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు తమ వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని వెల్లడిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్ యూజర్ల నంబర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో చాలామంది వాట్సాప్ యూజర్లను తమ వాట్సాప్ ఖాతా సమాచారాన్ని ఎవరైనా చూస్తున్నారా అనే సందేహం వెంటాడుతోంది.

    Also Read: యాపిల్ కంపెనీ శుభవార్త.. రూ. 5 వేల క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్..?

    కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకోవడం ద్వారా మన వాట్సాప్ అకౌంట్ మరింత భద్రంగా ఉండటంతో పాటు ఇతరులు వాట్సాప్ ఖాతా లోని మెసేజ్ లను చదవకుండా చేయవచ్చు. ఇందుకోసం మొదట సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఫీచర్స్ ను ఎనేబుల్ చేయాలి. ఆ తరువాత అకౌంట్ ఆప్షన్ లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఫోన్ కు ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ ను లాక్ చేసుకోవాలి.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    వాట్సాప్ లో ఇతరులు మన స్మార్ట్ ఫోన్ తీసుకున్నా మెసేజ్ లు చదవకుండా ఉండాలంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను సెట్ చేసుకోవాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఓపెన్ చేస్తే ఆరు అంకెల పిన్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను సెట్ చేసుకున్న తరువాత ఆరు అంకెల పిన్ ను ఎంటర్ చేస్తే మాత్రమే వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం సాధ్యమవుతుంది.