నానితో ‘జెర్సీ’ అంటూ మంచి క్లాసిక్ సినిమా తీసి.. అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అయితే గౌతమ్ తిన్ననూరి తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తోనే ప్లాన్ చేస్తున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. కాకపోతే, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ ఆ తరువాత మళ్ళీ వార్తలు వచ్చాయి. అయితే, బన్నీ టీమ్ లోని సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, త్వరలోనే బన్నీకి కథ చెప్పి ఒప్పించాలని గౌతమ్ అపాయింట్ మెంట్ తీసుకున్నాడట. బన్నీ కోసం మంచి ఎమోషనల్ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది.
Also Read: సూపర్ స్టార్ కి ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ !
అలాగే ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా సీడెడ్ బ్యాక్ డ్రాప్ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇక గౌతమ్, బన్నీ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. పైగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించింది. అన్నిటికీ మించి జెర్సీ సినిమాని హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చేస్తున్నాడు గౌతమ్.
Also Read: బాలయ్యా.. ఓవర్ బడ్జెట్ అయ్యా !
ఇక హిందీ జెర్సీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఇక తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ముఖ్యంగా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు అలాగే తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోన్నట్లు గౌతమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. హిందీలో గానీ జెర్సీ హిట్ అయితే, బన్నీతో చేయబోయే సినిమా పై అక్కడ కూడా భారీ ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి. మరి, బన్నీ, గౌతమ్ కథను ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఒప్పుకున్నా బన్నీతో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్