Homeఎంటర్టైన్మెంట్Andhra Pradesh Movie Ticket Rates 2026: ఆంధ్రాలో 'టాక్సిక్' టికెట్ రేట్స్ ఈ రేంజ్...

Andhra Pradesh Movie Ticket Rates 2026: ఆంధ్రాలో ‘టాక్సిక్’ టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయేంటి ..? డబ్బింగ్ సినిమాకు ఇంత అవసరమా!

Andhra Pradesh Movie Ticket Rates 2026: మన టాలీవుడ్ లో టికెట్ రేట్స్ వ్యవహారం లో ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను టికెట్ రేట్స్ పెంచుకోవడానికి రిక్వెస్ట్ చేస్తుంటాయి. ఇది వరకు చాలా తేలికగా టికెట్ రేట్స్ వచేసేవి . కానీ ఇప్పుడు తెలంగాణ లో టికెట్ రేట్స్ రావడం చాలా కష్టం. ఆంధ్రా లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అడగడమే ఆలస్యం , వెంటనే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం . పైగా ఆంధ్రా లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండడం, ఆయన కోటాలోనే సినిమాటోగ్రఫీ శాఖ ఉండడం తో టికెట్ రేట్స్ విషయం లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు .

Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్

మన టాలీవుడ్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవడం లో వెసులు బాటు కల్పించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని ఒక పక్క జనాలు , మరో పక్క విశ్లేషకులు అంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న కన్నడ స్టార్ హీరో యాష్ ‘టాక్సిక్ ‘ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది . సింగల్ స్క్రీన్స్ కి 75 రూపాయిలు , మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కి 100 రిప్యులు పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే సింగల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ ధర 222 రూపాయిలు కాగా, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో 277 రూపాయిలు ఉంటుందని అంటున్నారు. సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు, నెగటివ్ టాక్ వస్తే మాత్రమే మొదటి రోజే ఈ సినిమాకి క్లోజింగ్ పడుతుందని విశేల్షకులు అంటున్నారు.

ఇలా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్స్ పెంచుతూ , సినిమా అనే వినోదాన్ని ప్రేక్షకులకు దూరం చేస్తున్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికే ఇలా ఉంటే , ఇక ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం వచ్చే నెల 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు టికెట్ రేట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని భయపడుతున్నారు నెటిజెన్స్. తెలంగాణ లో అయితే ఇక టికెట్ హైక్స్ కి ఎలాంటి అనుమతి ఉండబోదని స్పష్టంగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, వాటికి హైక్స్ అవసరం, అప్పుడు ఎలా చేస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper