Anchor Sravanthi: తెలుగు బుల్లితెరకు ఎందరో యాంకర్లు వస్తున్నారు. కొందరు నిలదొక్కుకుంటుంటే కొందరు మాత్రం తమకు లక్ కలిసి రాక ఇంటి బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుల్లితెరను ఏలే యాంకర్లు ఎందరో తమ దూకుడుతో ఎదురులేదని అనిపించుకుంటున్నారు. ఇదే కోవలో స్రవంతి కూడా ఉంది. కానీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన ప్రతిష్ట మరింత పెంచుకుంది. బుల్లితెరలో రాణించాలంటే టాలెంట్ ఉండాలి. పదునైన మాటలతో ప్రేక్షకులను మెప్పించాలి. పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించుకుంటున్నారు. ఈ క్రమంలో అనసూయ, సుమ, రష్మీ లాంటి వాళ్లు బుల్లితెరను ఏలుతున్నారు. తమ మాటలతో అందరిని మైమరపిస్తున్నారు. దీంతో వారు లేని కార్యక్రమం ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు.

అనంతపురం జిల్లాకు చెందిన స్రవంతి మొదట ఓ చిత్రంలో అరంగేట్రం చేసింది. తరువాత చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ద్వారా మెరుపులు మెరిపించింది. ఈ నేపథ్యంలో ఎన్నో సినిమా ఈవెంట్లు చేసి తన సత్తా చాటుకుంది. దీంతో ఇండస్త్రీలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. తన మాటలతో అందరిని మంత్రముగ్గుదలను చేస్తోంది. వ్యాఖ్యాతగా తన స్థానం సుస్థిరం చేసుకుంటోంది. మెల్లగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటోంది.
Also Read: jagan New Ministers: ఇలా అయితే కష్టమే.. టీచర్ గా మారబోతున్న జగన్?
స్రవంతి ప్రశాంత్ అనే వ్యాార వేత్త తో ప్రేమలో పడింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నా కాదని అతడి సహకారంతో హాస్టల్ లో ఉండి తన కెరీర్ ను కొనసాగిస్తోంది. దీంతో వారిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంట్లో వారికి మాత్రం తెలియనివ్వలేదు. కానీ తరువాత తెలిస్తే ఏమవుతుందోననే ఆందోళనలోనే ఉంది. మెల్లగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అఖిల్ బ్యాచ్ తో ఉండటంతో ప్రేక్షకులు ఆమెను ఆదరించలేకపోయారు. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయింది. కానీ పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. మునుపటి కంటే ఎక్కువ క్రేజీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో బిజీ అయిపోయింది. కురుచటి దుస్తులు ధరించి కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఫలితంగా ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. ఏదిఏమైనా తన అందాలను ఆరబోస్తూ అవకాశాలను దక్కించుకుంటూ తనకెదురు లేదని నిరూపిస్తోంది. మంత్రాల బలం లేకున్నా తుంపిర్ల బలం ఉండాలన్నట్లు ఈ భామ తన అందాలతోనైనా ఆఫర్లు తెచ్చుకుంటూ బతుకుదెరువు తెచ్చుకుంటోంది. ఎలాగైతేనేమీ మనకు డబ్బు సంపాదించడమే ముఖ్యమని నమ్ముతూ స్రవంతి లాంటి చాలా మంది ఇలా ఏదో మార్గంగా అవకాశాలను రాబట్టుకుంటున్నారు.
అందాలనే నమ్ముకుని చాలా మంది పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు. అదే కోవలో స్రవంతి కూడా తన అందచందాలను ఎరగా వేసి ఆఫర్లు కొట్టేయడం చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో స్రవంతి బుల్లితెర తోపాటు వెండితెరలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమెకు ఇంకా మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా సినిమా ఇండస్త్రీని ఏలాలని స్రవంతి చూస్తోంది.
Also Read: Sajjala Ramakrishna Reddy: నిలదీస్తున్న వారంతా అర్హత లేనివారేనట.. సజ్జల కొత్త పల్లవి
Recommended Videos
[…] […]