https://oktelugu.com/

ప్చ్.. మళ్ళీ అడ్డంగా బుక్ అయింది !

‘యాంకర్‌ శ్యామల’ మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తోంది. ఆమె భర్త చీటింగ్ వ్యవహారం మొన్నటివరకూ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇందులో నిజానిజాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే, వచ్చిన బ్యాడ్ నేమ్ ను అందరూ త్వరగా మర్చిపోవాలనే ఆలోచనతో శ్యామల కొత్త రకం ఐడియాలతో ముందుకుపోతుంది. అందులో భాగంగా ఒక ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యేలా ప్లాన్ చేసింది. యాంకర్ శ్యామలకు క్రికెటర్‌ భువనేశ్వర్‌ కు మధ్య ఉన్న రిలేషన్‌ ఏమిటో మీకు […]

Written By:
  • admin
  • , Updated On : May 8, 2021 / 11:18 AM IST
    Follow us on

    ‘యాంకర్‌ శ్యామల’ మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తోంది. ఆమె భర్త చీటింగ్ వ్యవహారం మొన్నటివరకూ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇందులో నిజానిజాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే, వచ్చిన బ్యాడ్ నేమ్ ను అందరూ త్వరగా మర్చిపోవాలనే ఆలోచనతో శ్యామల కొత్త రకం ఐడియాలతో ముందుకుపోతుంది. అందులో భాగంగా ఒక ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యేలా ప్లాన్ చేసింది.

    యాంకర్ శ్యామలకు క్రికెటర్‌ భువనేశ్వర్‌ కు మధ్య ఉన్న రిలేషన్‌ ఏమిటో మీకు తెలుసా ? అంటూ ఒక దిగువస్థాయి యూట్యూబ్ హెడ్డింగ్ ఒకటి హైలైట్ అవుతూ ఒక పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముందయ్యా అంటే.. శ్యామల, భువనేశ్వర్ అక్కా, తమ్ముళ్లని, అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలున్నాయని ఆ పోస్టర్ లో రాసి ఉంది.

    ఇలాంటి పోస్టర్స్ సహజంగా ఫేక్ రాయుళ్లు సృష్టిస్తూ ఉంటారు. ఇక వీటిని మీమ్స్‌ క్రియేట్‌ చేసి షేర్ లతో లైక్ లతో తెగ హడావుడి చేస్తారు. ఈ పోస్టర్ కూడా అలాంటిదే అనుకున్నారు అందరూ. కానీ, ఈ పోస్టర్ వెనుక ‘యాంకర్ శ్యామల’ ఉందని తెలుస్తోంది. తన భర్త పై వచ్చిన వార్తలను జనం త్వరగా మర్చిపోవాలి అంటే.. వాళ్ళను అంతే స్పీడ్ గా డైవర్ట్ చేయాలి. అందుకే జనాన్ని డైవర్ట్ చేయడానికి శ్యామల ఈ చీప్ ట్రిక్ వాడిందని తెలుస్తోంది.

    పైగా ‘శ్యామల’ తనకు ఏమి తెలియనట్టు ఈ పోస్టర్ పై స్పందిస్తూ.. ‘అవునా..ఈ విషయం నాకే తెలియదు, వాళ్లకెలా తెలిసింది’ అంటూ చిన్న సెటైర్‌ టైప్ లో ఒక మెసేజ్ కూడా పెట్టింది. మొత్తానికి శ్యామల, భువనేశ్వర్‌ ను తన బ్రదర్‌ గా ఒక పోస్టర్ ను చేయించుకుని, మళ్ళీ తానే ఆ వార్తలో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చి, మొత్తానికి జనాన్ని బాగానే మ్యానేజ్ చేస్తోంది.