
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా అస్వస్థత, కళ్లలో మంటగా అనిపిస్తుండటంతో శుక్రవారం ఆమె కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం వెల్లడైన ఆ పరీక్షల ఫలితాల్లో కంగనా రనౌత్ కరోనా పాటిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వెల్లడించారు. కరోనా సోకడంతో నేనే సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నా కరోనా వైరస్ నా శరీరంలో పార్టీ చేసుకుంటున్న విషయం నాకు ఇప్పటి దాకా తెలియదు. మీరు కరోనాకు భయపడ్డారంటే అది మిమ్మల్ని మరింత భయపెడుతుందని కంగనా తన పోస్ట్ లో పేర్కొన్నారు.