Anasuya Bharadwaj: కెరీర్ బిగినింగ్ నుండి అనసూయ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతున్నారు. ఆమె తనవి కానీ వాటిని కూడా నెత్తిన వేసుకుంటారు. అందుకు అర్జున్ రెడ్డి వివాదమే నిదర్శనం. ఆ మూవీలో హీరో విజయ్ దేవరకొండ అమ్మనా బూతులు తిట్టడం, హీరోయిన్ ని కొట్టడం వంటి విషయాలను ఆమె వ్యతిరేకించారు. టీవీ ఛానల్స్ లో కూర్చోని డిబేట్స్ పెట్టారు. దాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు. ఆమెను ఓ శ్రీవాదిగా చిత్రీకరించుకున్నారు.

అదే సమయంలో మీ చిత్త శుద్ధి ఏంటని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. అమ్మ పేరున బూతులు తిట్టడం, అమ్మాయిలను కొట్టడం తప్పే కావచ్చు. కానీ జబర్దస్త్ లాంటి బూతు షోలో మీరు డబుల్ మీనింగ్ కామెడీ ఎంజాయ్ చేస్తారు. చాలీ చాలని బట్టలు ధరిస్తారు. మరి అక్కడ ఈ ఉద్యమం ఏమైందనేది ఆమెకు జనాల సూటి ప్రశ్న. కొన్ని స్కిట్స్ లో మగాళ్లు లేడీ గెటప్లో ఉన్నవారిని ఎగిరి కాలితో తంతారు. అక్కడ తన్నింది మగాడినే అయినా… పాత్ర మాత్రం భార్యో, ప్రియురాలో అవుతుంది. మరి అంతకంటే స్త్రీని అవమానించడం ఏముంది?
Also Read: Gautam Adani : చరిత్ర సృష్టించిన గౌతం అదానీ: ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడిగా అవతరణ
తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న సామెత మాదిరిగా అనసూయ తీరుందని విమర్శకులు అంటూ ఉంటారు. నిజంగా స్త్రీజనోద్ధరణ గురించి సీరియస్ నెస్ ఉంటే , ఆ దిశగా మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఏ డిబేట్స్ లో పాల్గొన్నారు? ఎలాంటి ఉద్యమాలు చేశారు?. పరిశ్రమలో మనకు తెలిసిన చాలా మంది ఫెమినిస్ట్స్ ఉన్నారు. ఉదాహరణకు సింగర్ చిన్మయి. తన ప్రొఫెషన్, కెరీర్ కూడా వదిలేసి ఆమె ఆడవాళ్ళ హక్కులు, వేధింపులపై పోరాడుతున్నారు.

నేను నాలాగే ఉంటాను, ఇతరులను విమర్శిస్తాను అంటే అర్థం లేదు. అనసూయ తీరు చూశాక తోటి యాంకర్ రష్మీ గౌతమ్ పై గౌరవం పెరుగుతుంది. ఆమె ఎలాంటి వివాదాల్లో తల దూర్చరు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఏదో అన్నాడని రాద్ధాంతం చేయదు. అందుకే రష్మీ జోలికి ఎవరూ వెళ్లరు. ఆమె పెట్ లవర్, మూగజీవాలకు ఎవరైనా హాని చేస్తే స్పందిస్తుంది. వాళ్లపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తుంది. ఆమె ఎంచుకున్న దారిలో సీరియస్ నెస్ కనిపిస్తుంది. అనసూయ విషయంలో పబ్లిసిటీ దాహం తప్పితే మరొకటి కనిపించదు. ఇదే కొనసాగితే అనసూయ కెరీర్ అటకెక్కినట్లే. సొసైటీలో ఆమెపై నెగిటివిటీ పెరిగితే అవకాశాలు తగ్గిపోతాయి. రష్మీ లాంటి వాళ్ళు అందిపుచ్చుకొని ముందుకు వెళతారు.
Also Read:Nithya Menon: కారులో బట్టలు విప్పేసి నిత్యామీనన్ ఏం చేసింది?
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0