Ananya Nagalla: తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఎక్స్పోజింగ్ తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. సత్తుపల్లిలో పుట్టిన అనన్య నాగళ్ళ నటి కావాలనే మక్కువతో పరిశ్రమలో అడుగుపెట్టారు. షాదీ టైటిల్ తో తెరకెక్కిన ఓ షార్ట్ ఫిల్మ్ ఆమెకు ఫేమ్ తెచ్చింది. దాంతో సిల్వర్ స్క్రీన్ ఆఫర్ పట్టేసింది. 2019లో విడుదలైన మల్లేశం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మల్లేశం ఓ బయోపిక్. ప్రియదర్శి లీడ్ రోల్ చేశారు. ఆయన భార్య పాత్రలో అనన్య నటించారు.
మల్లేశం మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం ప్లే బ్యాక్ అనే ఓ మూవీ చేశారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ మూవీలో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. వకీల్ సాబ్ చిత్రంలో కీలక రోల్ ఆమె చేశారు. కథలో ప్రధానమైన ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిగా అనన్య నటించారు. అంజలి, నివేదా థామస్ మిగతా ఇద్దరు అమ్మాయిల పాత్రల్లో నటించారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ మంచి విజయం అందుకుంది.
వకీల్ సాబ్ మూవీతో అనన్య వెలుగులోకి వచ్చారు. అయితే ఆమెకు లీడింగ్ రోల్స్ రావడం లేదు. సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలంలో చెలికత్తె పాత్ర చేసింది. శకుంతల చెలికత్తె అనసూయగా ఆమె నటించారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం కనీస ఆదరణకు నోచుకోలేదు.ప్రస్తుతం అనన్య బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కి జంటగా బూట్ కట్ బాలరాజు అనే మూవీ చేస్తున్నారు. ఈ స్మాల్ బడ్జెట్ మూవీలో ఆమె లీడ్ హీరోయిన్.
ఆ మధ్య అనన్య మీద ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. ఓ బిగ్ షాట్ కొడుకుతో లవ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను అనన్య ఖండించారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇక టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అంతగా లైఫ్ ఉండదు. అనన్యను కూడా పట్టించుకున్న నాథుడు లేదు. దీంతో సోషల్ మీడియాను నమ్ముకుంది. అందాల ప్రదర్శనతో అటెన్షన్ రాబడుతుంది. అనన్య లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
View this post on Instagram