Homeఎంటర్టైన్మెంట్Allu Sirish Wedding Celebrations: అల్లు అర్జున్ రచ్చ రంబోలా పార్టీ.. ఆ డ్రెస్సులు, విందు,...

Allu Sirish Wedding Celebrations: అల్లు అర్జున్ రచ్చ రంబోలా పార్టీ.. ఆ డ్రెస్సులు, విందు, వినోదాలు కేక.. రాంచరణ్ ఒక్కడే కాస్తా..!

Allu Sirish Wedding Celebrations: మార్చి 6వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి జరగబోతున్న సందర్భంగా, అల్లు అర్జున్ నిన్న హైదరాబాద్ లో భారీ పార్టీ ని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ కి ఆయన మిత్రులతో పాటు, బంధువులు కూడా కొంతమంది హాజరు అయ్యారు. వారిలో అల్లు అర్జున్ బావ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కూడా ఉన్నాడు. అయ్యప్ప మాల ధరించిన రామ్ చరణ్, తన భార్య ఉపాసన తో కలిసి ఈ పార్టీ లో పాల్గొన్నాడు. రామ్ చరణ్ రాగానే అల్లు అర్జున్ ప్రేమతో హత్తుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈరోజు మొత్తం ఇవే ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. బావబామ్మర్ది మధ్య ఉన్న ప్రేమని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే కొందరు సోషల్ మీడియా లో అల్లు స్నేహా రెడ్డి ధరించిన పొట్టి దుస్తులపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గానే ఈ పొట్టి దుస్తుల వ్యవహారం లో శివాజీ కామెంట్స్ చేయడం, అది ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు స్నేహ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ పై కొంతమంది నెటిజెన్స్ చేసే నెగిటివ్ కామెంట్స్ పై కూడా అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ కల్చర్ లో ఏ అమ్మాయి అయినా అలాంటి దుస్తుల్లోనే వస్తారు,కొందరు అలాంటి దుస్తుల్లో రాకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అయినా అబ్బాయిలు ఏ బట్టలు అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఎలాంటి కామెంట్స్ రావు, కేవలం అమ్మాయిలు వేసుకున్నప్పుడే మీకు సమస్య అవుతుందా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

ఇకపోతే ఈ పార్టీ లో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. డిఫరెంట్ కలర్స్ తో ఆయన హెయిర్ స్టైల్ ఉండడంతో, అట్లీ తో చేయబోతున్న సినిమా కోసం ఏర్పాటు చేసుకున్న హెయిర్ స్టైల్ ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా నిన్న పార్టీ లో అల్లు శిరీష్, నయనికా జంట కూడా చూడముచ్చటగా అనిపించింది. నయనికా కూడా ఈ పార్టీ లో పొట్టి దుస్తుల్లోనే కనిపించడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ లో చాలా విశేషాలే జరిగాయి. అయితే రామ్ చరణ్ మాల ధరించిన కారణంగా, ఆయన మందు తాగడం వంటివి చేయలేదు. కేవలం అల్లు అర్జున్ పిలిచాడు కాబట్టి తన సతీమణి తో వచ్చి, కాసేపు ఉండి వెళ్ళిపోయాడట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular