Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసి క్యాన్సిల్ చేసుకున్న ఇద్దరు స్టార్...

Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసి క్యాన్సిల్ చేసుకున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు…

Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ప్రతి ఒక్కరూ వాళ్లకు ఉన్న టాలెంట్ ని వాడుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ లు సాధించిన వారు మాత్రమే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సక్సెసులు లేక అవకాశాలు రాక చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో మనకు తారసపడుతూ ఉంటాయి. ఇక ఏది ఏమైనా […]

Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ప్రతి ఒక్కరూ వాళ్లకు ఉన్న టాలెంట్ ని వాడుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ లు సాధించిన వారు మాత్రమే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సక్సెసులు లేక అవకాశాలు రాక చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో మనకు తారసపడుతూ ఉంటాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ లు వస్తాయనుకోవడం పొరపాటు అవుతుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం మొదట్లో ఒక్క సక్సెస్ కోసం విపరీతంగా కష్టపడుతూ తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఆయనను టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు సాధించిన విజయాలు అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిలిపాయి. ఒక ఇద్దరు దర్శకులతో అతను సినిమాని అనౌన్స్ చేసి మరి క్యాన్సిల్ చేసుకున్నాడు. కారణం ఏదైనా కూడా ఆ సినిమాలు క్యాన్సిల్ అవ్వడం వెనక చాలా పెద్ద చర్చలైతే జరిగాయని చాలామంది చెబుతుంటారు.

కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలి. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయింది. అల్లు అర్జున్ కావాలనే ఆ సినిమాని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడని మొదట్లో చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు.

కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అల్లు అర్జున్ కావాలనే కొంతమంది దర్శకులను పక్కన పెడుతున్నాడని తనకు నచ్చిన దర్శకుడితో మాత్రమే సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. పుష్ప 2 సినిమా ముందు వరకు ఆయన స్టార్ డైరెక్టర్లను కలిసి వాళ్లతో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాడు. కానీ పుష్ప 2 సినిమా పాన్ ఇండియాలో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించడంతో ఆయనను ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper