Akhanda 2
Akhanda 2 : నందమూరి అభిమానులతో పాటు మామూలు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘అఖండ 2′(Akhanda 2). 2021 వ సంవత్సరం లో బాలయ్య(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ'(Akhanda Movie) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఒక్క విధంగా చెప్పాలంటే బాలయ్య కి గోల్డెన్ పీరియడ్ మొదలైంది ఈ సినిమా నుండే. ఇక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ కాంబినేషన్స్ ని ఏర్పాటు చేసుకుంటూ హిట్ మీద హిట్ కొడుతూ నేటి తరం స్టార్ హీరోలకు సమానంగా తన బాక్స్ ఆఫీస్ స్టామినా ని పెంచుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘అఖండ’ లాంటి సినిమాకు సీక్వెల్ చేస్తే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.
Also Read : అఖండ 2 లో ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చుపెడుతున్నారా..?
ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ లో రామ్ అచ్చంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. వీళ్లిద్దరికీ ఇటీవల కాలం లో ‘ఏజెంట్’, ‘భోళా శంకర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. మధ్యలో ‘సామజవరగమనా’ వంటి సూపర్ హిట్ సినిమా ఉంది కానీ, అందులో వచ్చిన లాభాలు, ఈ సినిమాల నష్టాలను ఏమాత్రం పూడ్చలేకపోయింది. ఇప్పుడు ఈ నిర్మాతలకు కొత్త టెన్షన్ ఒకటి పట్టుకుంది. అదేమిటంటే ఈ చిత్రాన్ని మొదట్లో కేవలం 150 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించాలని చూశారట. కానీ సెట్స్ మీదకు వెళ్లి కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక ఆ బడ్జెట్ కాస్త 175 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి, ఇప్పుడు మిగిలిన షూటింగ్ పూర్తి అవ్వడానికి బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని, 200 కోట్ల రూపాయలకు బడ్జెట్ అంచనాలు చేరిందని అంటున్నారు.
ఇదే నిర్మాతలకు కాస్త కలవరపెడుతున్న విషయం. ఎందుకంటే బాలయ్య మార్కెట్ కేవలం వంద కోట్ల రూపాయిల షేర్ వరకే ఉంటుంది. ఆయన సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది. ‘అఖండ 2’ సీక్వెల్ కాబట్టి ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రావొచ్చు. అంతకు మించి 200 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలంటే అంత తేలికైన విషయం కాదు. నందమూరి హీరోలలో స్టార్ లీగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికే 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక సీనియర్ హీరో క్యాటగిరీలో ఉన్న బాలయ్య కి అంతటి వసూళ్లు ఎక్కడ నుండి వస్తాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read : షూటింగ్ దశలోనే ఉన్నప్పుడే 80 కోట్లు..సరికొత్త చరిత్ర సృష్టించిన బాలయ్య ‘అఖండ 2’ !