Pakistan attack on Afghanistan: గాజా పునర్నిర్మాణ కమిటీలో పాకిస్తాన్‌ను చేర్చింది అమెరికా. సౌదీ అరేబియాతో కలిసి పాకిస్తాన్ సైన్యం ఇందులో పాల్గొనాలి. కానీ పాలస్తీనియన్లు, హమాస్‌పై దాడిచేస్తే స్వదేశంలోనే వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుంది. దీని నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ పొరుగు దేశం ఆఫ్గానిస్తాన్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు.. తమ దేశంపై దాడులు చేస్తున్నారని, ఆఫ్గానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నారని పాకిస్తాన్ ఆ దేశంపై వైమానిక దాడులు చేస్తోంది.
పాకిస్తాన్‌పై ప్రతిదాడులు..
మొదట ఓపిక పట్టిన తాలిబాన్ పాలకులు ఇప్పడు ప్రతిదాడులు చేస్తున్నారు. పాక్ సైన్యాన్ని ఊచకోత కోస్తున్నారు. పాక్ పోస్టుదు ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వార్ రూల్స్ అతిక్రమించి ఉగ్రవాదుల పేరుతో సామాన్యులపై దాడులు చేస్తోంది. తాజాగా కాబూల్‌లోని ఆస్పత్రిపై వైమానికి దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది మరణించారు. 250 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర.. మనం ఏం నేర్చుకోవాలి..?
ప్రతిచర్య తప్పదు..
పాకిస్తాన్ దాడిని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. ఆడంగి చర్యలతో పాకిస్తాన్ కవ్విస్తోందని పేర్కొన్నారు. ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. సరిహద్దు విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోందని, ఇటీవలి కాల్పుల్లో అఫ్ఘాన్ సైనికులు మరణించారని పేర్కొన్నారు.
పాకిస్తాన్ బుకాయింపు..
ఇదలా ఉంటే.. ఆఫ్గానిస్తాన్ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. తాము ఏ ఆస్పత్రిపై దాడి చేయలేదని తెలిపింది. అఫ్ఘాన్ ఆరోపణల్లో నిజాలు లేవని పేర్కొంది. ఇది ఇరు దేశాల మధ్య మూడో వారంలో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తోంది.
పాక్–అఫ్ఘాన్ సరిహద్దు ఘర్షణలు డ్యూరాండ్ లైన్ వద్ద ఎక్కువ కాలంగా కొనసాగుతున్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు పాక్ చెబుతోంది. ఈ ఘటన పౌరులపై దాడిగా మారడంతో అంతర్జాతీయ జోక్యం అవసరం పడుతోంది. ఇలాంటి దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధం పరిస్థితులు సృష్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రతీకార చర్యలకు దిగితే పౌర నష్టాలు పెరిగే అవకాశం ఉంది.