Akhanda 2
Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడని మనిషంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈ కాంబినేషన్ పై ఎన్ని అంచనాలైనా ఉండనీ, విడుదల తర్వాత ఆ అంచనాలకు మించే అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ ఉంటుంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ'(Akhanda Movie) వంటి చిత్రాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడమే అందుకు ఉదాహరణ. ‘అఖండ’ చిత్రం తర్వాత బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. ఇది వరకు ఆయన కెరీర్ లో ఎప్పుడూ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ రావడం జరగలేదు. ఇకపోతే ఈ ‘అఖండ’ కి సీక్వెల్ గా ‘అఖండ – తాండవం'(Akhanda 2 Movie) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Also Read: ‘విశ్వంభర’ సెట్స్ లో శ్రీలీల కి విలువైన బహుమతిని అందించిన మెగాస్టార్ చిరంజీవి!
గత కొద్దిరోజుల నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా కొనసాగుతుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే, బిజినెస్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో జరుగుతుందని టాక్. బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 60 కోట్ల రూపాయలకు తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషలకు కలిపి కొనుగోలు చేసింది. రీసెంట్ గానే ఆ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయగా, సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అందుకే ‘అఖండ 2 ‘ ఓటీటీ రైట్స్ దాదాపుగా 80 కోట్ల రూపాయలకు ఒక ప్రముఖ ఓటీటీ ఛానల్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ ఓటీటీ బిజినెస్ ఈమధ్య కాలం లో జరగలేదు.
అలాంటిది ‘అఖండ 2’ కి జరిగిందంటే ఈ సినిమాకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోతే, ఇక థియేట్రికల్ రైట్స్, మరియు ఇతర నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ కలిపి, ఏ రేంజ్ కి అమ్ముడుపోతుందో ఒక్కసారి ఊహించుకోండి. తక్కువలో తక్కువ ఈ సినిమాకి కనీసం 350 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే సీనియర్ హీరోలలో బాలయ్య ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్టే. ఈ చిత్రం లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా అనుకున్న తేదికి వచ్చేలా ఉంది కానీ, గ్రాఫిక్స్ మీద ఎక్కువగా ఆధారపడే సినిమా కాబట్టి వాయిదా పడినా పడొచ్చని అంటున్నారు విశ్లేషకులు.