Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు మే9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుందని మేకర్స్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయని, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశామని, కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని. ఏప్రిల్ మొదటి వారం లో అది కూడా పూర్తి అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు. సుమారుగా 5 ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం పై అప్పట్లో అంచనాలు భారీగా ఉండేవి. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ రావడం, సినిమా కంటెంట్ ని పూర్తి స్థాయిలో తెలిపే ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటి వరకు రాకపోవడం వల్ల హైప్ బాగా తగ్గిపోయింది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు..లేటెస్ట్ పోస్టర్ వైరల్!
ఇప్పుడు మళ్ళీ హైప్ ని తిరిగి తీసుకొని రావడానికి చాలా కష్టమైన పనిగా మారింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలలో ‘కొల్లగొట్టినాదిరో’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకపక్క యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి, మరోపక్క ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కూడా భారీగానే పడుతున్నాయి. ఈ పాట ద్వారా కాస్త మామూలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం మూవీ టీం చేసింది కానీ, ఇది సరిపోదు, ఇంకా కావాలి. అందుకే ఉగాది నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని చాలా అగ్రెసివ్ గా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఉగాది సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేస్తారట. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారం లో ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేకింగ్ వీడియో ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి గేమ్ చేంజర్ గా మారబోతుందట.
ఇక ఆ తర్వాత మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసి, ఏప్రిల్ రెండవ వారం లో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. కేవలం తెలుగు ఆడియన్స్ లో మాత్రం కాదు, హిందీ ఆడియన్స్ లో కూడా ఈ థియేట్రికల్ ట్రైలర్ భారీ అంచనాలను ఏర్పాటు చేసే విధంగా ఉంటుందట. వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ గా ఉండబోతుందని, రాబోయే ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో తెలిపే విధంగా ఉంటుందని అంటున్నారు. బిజినెస్ కూడా ఉగాది నుండి అన్ని ప్రాంతాలకు మొదలు పెడతారట. ఏప్రిల్ 23వ తేదికి ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యి మొదటి కాపీ సిద్ధంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుంది అనేది.
Also Read : మే9 న విడుదల..ఎట్టకేలకు ‘హరి హర వీరమల్లు’ కి మోక్షం..కనీసం ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?