Akhanda 2
Akhanda 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…ప్రస్తుతం ఈయన ‘అఖండ 2’ సినిమాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం ఆయన వరుస సక్సెస్ ల్లో ఉన్నాడు. కాబట్టి ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా విజయాల పరంపర ను కొనసాగించాలని చూస్తున్నాడు… అందుకే ఆయన అచి తిచి మరి సినిమాలను ఎంచుకుంటున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వరుసగా నాలుగు విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న బాలయ్య ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా వరుస సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఒక ఫైట్ కోసం దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ ఫైట్ తో సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ ఫైట్ ని భారీ సెట్ వేసి మరి షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బాలయ్య బాబు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : షూటింగ్ దశలోనే ఉన్నప్పుడే 80 కోట్లు..సరికొత్త చరిత్ర సృష్టించిన బాలయ్య ‘అఖండ 2’ !
బోయపాటి సైతం ఈ సినిమాను తన ప్రస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే ఆయన చేసిన ‘స్కంద’ (Skanda) సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆయన కొంతవరకు డిసప్పయింట్ ను వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే బాలయ్య బాబు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇండియాలో ఆయన స్టార్ హీరోగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అఖండ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో అంతకుమించి ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే బోయపాటి మరోసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. తద్వారా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్లో చూపించడమే టార్గెట్ గా పెట్టుకున్న బోయపాటి భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…
Also Read : అఖండ 2′ కి పోటీగా ‘రాజాసాబ్’..బాలయ్య మేనియా ని ప్రభాస్ తట్టుకోగలడా..? 2010 రిపీట్ కానుందా!