Pagadala Praveen
Pagadala Praveen : మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి(Rajahmundry)లో పగడాల ప్రవీణ్ చనిపోయి కనిపించాడు. ఒంటిపై గాయాలు.. రక్తపు మరకలు ఉండడంతో ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని స్థానికులు భావిస్తున్నారు. అయితే శరీరంపై గాయాలు ఉండడంతో ఆయన మరణం పై అనుమానాలు ఉన్నాయని మహాసేన రాజేష్, జీవీ హర్ష కుమార్ లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నగరంలోని దివాన్ చెరువు – కొంతమూరు నేషనల్ హైవేపై ప్రవీణ్ చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అతడి మృతదేహం పక్కన బైక్ ఉంది. అయితే రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ చనిపోయాడని స్థానికులు భావించారు. ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించడంతో.. అతడి అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. పగడాల ప్రవీణ్ హైదరాబాదులో క్రైస్తవ మత ప్రచారకుడిగా పని చేస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు సమాధానం లభించలేదు. అయితే కొంతమంది మాత్రం ప్రవీణ్ హైదరాబాదు నుంచి విశాఖపట్టణానికి బైక్ మీద వెళ్తున్నారని చెబుతున్నారు.
Also Read : కష్టేఫలి.. 1800 పెట్టుబడితో.. 100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే?
వాహనం ఢీ కొట్టి ఉంటుందా..
ప్రవీణ్ బైక్ మీద వెళుతున్నప్పుడు వెనకనుంచి ఏదైనా వాహనం ఢీ కొట్టి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రవీణ్ దేహం పై గాయాలు ఉన్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు కోరుతున్నారు.. క్రైస్తవ మత ప్రచారకులు కూడా ఇదే తీరుగా డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి సంఘటనా స్థలం వరకు ఉన్న సిసి పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ మృతి పై క్రైస్తవ మత ప్రచారకులు విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ మరణం పై విచారణ జరిపించాలని టిడిపి నేత మహాసేన రాజేష్ కూడా డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రవీణ్ బైక్ మీద హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్నారు అంటే నమ్మశక్యంగా లేదని.. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని జీవి హర్ష కుమార్ చెబుతున్నారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు రాజమండ్రిలో ఆందోళన చేశారు. క్రైస్తవ సంఘాల కోరిక మేరకు ప్రవీణ్ పోస్టుమార్టాన్ని తమ సూచించిన వ్యక్తి సమక్షంలో వీడియో రికార్డ్ చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు కోరగా.. దానికి పోలీసులు అంగీకరించారు. కాగా, ప్రవీణ్ చనిపోయిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చకు కారణమవుతోంది. అంతేకాదు క్రైస్తవ మత ప్రచారకులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా రావడంతో రాజమండ్రి నగరం కిటకిటలాడింది. క్రైస్తవ మత ప్రచారకులు ఆందోళన చేయడంతో అటుడికింది.
Also Read : థాయ్ రాజా థాయ్; ఇక్కడ తప్పించుకున్నా: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్