Pavitra Lokesh: సీనియర్ నటి పవిత్రా లోకేష్ చేతులు కాలాక ఇప్పుడు తీరిగ్గా ఆకులు పట్టుకుంటాను అంటుంది. వెటకారంగా ఉన్నా.. ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం ఇలాగే ఉంది. నటుడు సీనియర్ నరేష్ తో రొమాన్స్ అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో వీరి అక్రమ సంబంధం సక్రమంగా బయట పడింది. దీనికి తోడు నరేష్ మూడో భార్య వచ్చి పవిత్రా ఆంటీ జీవితాన్ని అతలాకుతలం చేసేసింది.

నిజానికి, నరేష్ తో ప్రేమ కహాని బయట పడక ముందు వరకూ ఆంటీకి భారీ ఆఫర్లు వచ్చాయి. ప్రతి పెద్ద సినిమాలోనూ ఆమెకు ఓ పాత్ర ఉండేది. మరోపక్క నరేష్ కూడా తన చేతుల్లోనే ఉన్నాడు. నరేష్, ఇంటి మొహం కూడా చూడటం లేదు. ఆ స్థాయిలో అతగాడు తనకే కట్టుబడి ఉన్నాడు. ఇక తనకు తిరుగు లేదు అనుకుంది పవిత్రా లోకేష్. అందుకే, ప్రస్తుతం ఉన్న రెండో మొగుడ్ని కూడా వదిలేసింది.
పైగా ఆ సమయంలో పవిత్రా లోకేష్ కళ్ళు తలకెక్కాయి. ఎవరిని లెక్క చేయలేదు, చివరకు భర్తను కూడా. నరేష్ తో తనది అపూర్వ ప్రేమ అని, అసలు తనది పాన్ ఇండియా రేంజ్ అని, సదరు రెండో భర్త గారిని ఇంటి నుంచి గెంటేసింది. పైగా అతగాడి దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ను కూడా అతనికి కాకుండా చేసి ఉట్టి చేతులతో అతన్ని రోడ్డు మీద నిలబెట్టింది.
ఈ క్రమంలోనే అతను పవిత్రా లోకేష్ పై విమర్శలు చేసాడు. ఓ టీవీ ఛానెల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి, ఆమె బరితెగింపు తనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దాంతో పవిత్రా రెండో మొగుడిని ఎడమ కాలితో ఛీ కొట్టిన్నంత పని చేసింది. కట్ చేస్తే.. నరేష్ తో పవిత్రా ప్రేమ పెటాకులు అయింది. హోటల్ రూమ్ లో నుంచి ఇద్దరూ బయటకి వస్తున్న విజువల్స్ పవిత్రా జీవితాన్ని తారుమారు చేశాయి.

పవిత్రాకి ఛాన్స్ లు తగ్గాయి. మరోపక్క ఇప్పుడు సీనియర్ నరేష్ కూడా జారుకునేలా ఉన్నాడు. ఐతే, దీనికంతటికి కారణం పవిత్రానే. ఆల్రెడీ పవిత్రా కి చేతులు కాలాయి. ఇప్పుడు ఆమె బొబ్బలు లెక్క పెట్టుకునే పనిలో ఉంది. అయితే, విచిత్రంగా పవిత్రాలో ఇప్పుడు పవిత్రత బయటకు తన్నుకొస్తోందట. మొన్న ఈ మధ్య ఓ సినిమా సెట్ లో చాలా పవిత్రంగా నటించేస్తూ తెగ జీవించేసిందట.
కానీ, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఆంటీ. అసలు, ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి”. ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అన్నిటికీ ముందు చేతులు కాలేకా అకులు పట్టుకుని ఉపయోగం లేదు పవిత్రా లోకేష్ గారు. ఇకనైనా మారండి.