Odi World Cup 2023: ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీం అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ వరల్డ్ కప్ టోర్నీలో పెద్ద జట్లకు సైతం ఏ మాత్రం తగ్గకుండా తనదైన రీతిలో ఆడుతూ విజయాలను సొంతం చేసుకుంటుంది. మొదటినుంచి కూడా అఫ్గాన్ టీమ్ కి ఇండియన్ టీమ్ సపోర్ట్ చాలా వరకు లభిస్తూ వస్తుంది.మరి ముఖ్యంగా ఇండియన్ అభిమానులు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లని ఓన్ చేసుకుని మనవాళ్లు అనే ఫీల్ తో ఉంటున్నారు దానితో పాటు గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండటంతో అఫ్గాన్ టీమ్ చాలా వరకు అద్భుతాలు చేయగలుగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఆఫ్గనిస్తాన్ టీం కి బిసిసిఐ కూడా చాలా అండగా నిలబడుతూ వస్తుంది వాళ్లకి ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తూ వాళ్ళ దేశంలోనే వాళ్ళకంటూ ఒక స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఇక ఇదే క్రమంలో అఫ్గాన్ ప్లేయర్లు ఇండియన్ బ్యాట్స్ మెన్స్ ని ఫాలో అవుతూ ఇండియాన్ ప్లేయర్లు ఏ విధమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నారో వాళ్లు కూడా అదే స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అయి రంగంలోకి దిగుతున్నారు.ఇక మన స్టార్ ప్లేయర్లు అయిన కోహ్లీ ని రోహిత్ శర్మ ని అనుసరిస్తూ అద్భుతమైన స్కోర్ చేసి ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తూ ఈజీగా మ్యాచ్ లు గెలుస్తున్నారు. అయితే వీళ్ళకి ఒకప్పటి ఇండియన్ ప్లేయర్ అయిన అజయ్ జడేజా మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.అతని సజెషన్స్ తోనే ఆఫ్ఘనిస్తాన్ టీం వండర్స్ ని క్రియేట్ చేస్తుంది.
ఇక ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు వరుస విజయాలను అందుకోవడమే కాకుండా అజయ్ జడేజా పేరును కూడా నిలబెడుతున్నారు.ఇక మిగితా టీములు వీళ్లతో ఈజీగా మ్యాచ్ లు ఆడి గెలుస్తాం అనుకునే స్థాయి నుంచి వీళ్ళతో ఆడాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఆడాలి అని అన్ని టీమ్ లు అనుకునే రేంజ్ కి ఎదిగి మంచి పేరు గుర్తింపుని తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీం వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ రేస్ లో ముందు వరుసలో నిలిచింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మ్యాచ్ లు ఆస్ట్రేలియా , సౌతాఫ్రికా టీముల పైన ఆడాల్సి ఉంది.
ఈ రెండు టీంలు కూడా చాలా పెద్ద టీంలు కావడంతో ఆఫ్గనిస్తాన్ ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ రెండు మ్యాచ్ ల్లో గనక ఆఫ్గనిస్తాన్ టీమ్ విజయం సాధిస్తే అఫ్గాన్ టీమ్ డైరెక్ట్ గా సెమీ ఫైనల్ కి వెళ్ళిపోతుంది… ఇక లేదు ఒక మ్యాచ్ లో గెలిస్తే మాత్రం మిగితా జట్ల విజయాల మీద ఆధారపడాల్సి ఉంటుంది…