Jayalakshmi: సినిమాకు హీరోహీరోయిన్ లు ఎంత ముఖ్యమో సైడ్ క్యారెక్టర్లు కూడా అంతే ముఖ్యం. ఇక తల్లిదండ్రుల పాత్ర, అన్నాచెల్లెల్లు, ఫ్రెండ్స్ ఇలా ఎన్నో పాత్రలు అవసరం అవుతాయి. ఇలాంటి వాటికోసం చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. వారు కూడా హీరోహీరోయిన్ లు సంపాదించే క్రేజ్ సంపాదిస్తుంటారు. ఇలా ఓ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న వారిలో జయలక్ష్మీ ఒకరు. ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. మరి అవేంటో మీకోసం..
రామబాణం సినిమా గురించి వ్యాఖ్యలు చేశారు జయలక్ష్మీ. సినిమా ఇండస్ట్రీలో తను ఎలాంటి పాత్రలు పోషిస్తుందో అందరికి తెలుసని.. కొన్ని సార్లు అజ్ఞానం వల్ల మంచి ఆఫర్లు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇక రామ్ చరణ్ సినిమా ఒకటి మిస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సార్లు డేట్స్ వల్ల రెండు విధాలుగా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే రామబాణం సినిమాలు చేయడానికి తాను ఆసక్తి చూపించిందట. కానీ అనుకోని కారణాల వల్ల తిట్లు తిన్నట్టు తెలిపింది.
ఇక రామబాణం సినిమాలో రెండు సీన్లు పూర్తి చేశారట. కానీ ఇతర కారణాల వల్ల షూటింగ్ డిలే అయిందట. గోపీచంద్ కు ఫ్రాక్చర్ అవడం వల్ల ఆ సినిమా మరింత ఆలస్యం అయిందని పేర్కొంది జయలక్ష్మీ. అయితే తను అమెరికా వెళ్లే డేట్ కంటే తర్వాత షూటింగ్ డేట్స్ ఇచ్చారట. కానీ అమెరికా వెళ్తున్నాం.. ఈ సమయంలో డేట్స్ ఇస్తే ఎలా అని అడిగితే సీరియస్ అయ్యారట. తన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి అని అడిగితే.. ఫారిన్ ట్రిప్ కు వెళ్లేవారికి సినిమాలు ఎందుకు అన్నారట. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడంతో తాను చాలా హట్ అయ్యాను అని తెలిపింది జయలక్ష్మీ.