
Surekha Vani: నటి సురేఖా వాణి బీచ్ వెకేషన్ లో ఉన్నారు. అందమైన సాగరతీరంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. మరి బీచ్ అంటే కొంచెం హాట్ హాట్ బట్టలు వేయాల్సిందే. సురేఖా వాణి యంగ్ హీరోయిన్ రేంజ్ లో ఫోజులు కొడుతున్నారు. ఆమె గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దారుణం ఏమిటంటే… సురేఖా వాణి ఫోటోను జూమ్ చేసి చూసి అందులో బోల్డ్ డిటైల్స్ వెతికాడు ఓ నెటిజన్. ఆమె లోదుస్తులు కూడా వేసుకోలేదంటూ కొంచెం పచ్చి కామెంట్స్ చేశారు.
సురేఖా వాణి ఫొటోలతో పాటు ఆ నెటిజన్ కామెంట్ కూడా వైరల్ అవుతుంది. చాలా మంది కుర్రాళ్ళు ఇదే తరహాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జనాల రియాక్షన్ చూస్తుంటే సురేఖా వాణి గ్లామర్ కి ఇంత డిమాండ్ ఉందా అనిపిస్తుంది. ఈ మధ్య ఆమెకు సినిమా ఆఫర్స్ తగ్గాయి. లేడీ కమెడియన్ గా ఒకప్పుడు జోరు చూపించిన ఈ యాక్ట్రెస్ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. పరిశ్రమ నన్ను పక్కనపెట్టేసిందని ఇటీవల సురేఖా వాణి ఓపెన్ అయ్యింది.
త్వరలో ఆమె ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీలో కనిపించనున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ సోహైల్ హీరో. దాదాపు టాలీవుడ్ కమెడియన్స్ ఆర్గానిక్ హైబ్రిడ్ మామ చిత్రంలో నటిస్తున్నారు. కాగా సురేఖా వాణి యాంకర్ గా పరిశ్రమలో అడుగుపెట్టారు. మా మ్యూజిక్ ఛానల్ లో ఆమె యాంకర్ గా వ్యహరించారు. పరిశ్రమలో పరిచయాలు పెంచుకొని నటిగా ప్రమోట్ అయ్యారు.

దర్శకుడు శ్రీను వైట్ల ఈమెను మంచి పాత్రలతో ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వం వహించిన రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా చిత్రాల్లో సురేఖా వాణి లేడీ కమెడియన్ గా ఆకట్టుకున్నారు. ఆమె కెరీర్ సక్సెస్ ట్రాక్ లో వెళుతుండగా విషాదం చోటు చేసుకుంది. సురేఖా వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో కన్నుమూశారు. 2019లో ఆయన మరణించగా కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు.
సురేఖా వాణికి ఒక కూతురు ఉన్నారు. ఆమె కూడా పాపులారిటీ రాబట్టారు. సోషల్ మీడియాలో ఆమెకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖా వాణి కల. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కూతురితో గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు చేయిస్తున్నారు. మరి సురేఖా వాణి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.