Homeఆంధ్రప్రదేశ్‌Actress Sri Reddy: పవన్ భార్య, పిల్లల జోలికొస్తే నరుకుతా కొడతా.. అనిల్ కుమార్‌‌కి శ్రీరెడ్డి...

Actress Sri Reddy: పవన్ భార్య, పిల్లల జోలికొస్తే నరుకుతా కొడతా.. అనిల్ కుమార్‌‌కి శ్రీరెడ్డి వార్నింగ్

Actress Sri Reddy: శ్రీరెడ్డి పేరు గురించి నెటిజన్లకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. వైసీపీ అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఫేస్ బుక్ లైవ్ లోకి వస్తుంది. విమర్శలు చేసిన వారిపై బూతూ పదజాలంతో కడిగేస్తుంది. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే బూతులతోనే సమాధానం చెబుతుంది. ఇటీవల జనసేన అధినేత పవన్ పై కూడా అదే చేసింది. ఇలా వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ కూడా పవన్ పై బూతులు తిడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. పవన్ భార్యపై అసభ్య పదజాలాన్ని వాడాడు. దీంతో ఆ నాయకుడిపై పవన్ వైపు నుంచి కంటే ముందుగానే సొంత పార్టీ మద్దతురాలైన శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ‘పవన్ భార్య, పిల్లలకు వస్తే నరుకుతా నా కొడుకా..’ అంటూ శివాలెత్తింది. ఇన్నాళ్లు పవన్ కు వ్యతిరేకంగా ఉన్న ఆమె జనసేన అధినేతకు సపోర్టుగా మాట్లాడడం ఆసక్తిగా మారింది.

Actress Sri Reddy
Actress Sri Reddy, Anil Kumar

సాధారణంగా పవన్ పై విమర్శలు చేసే శ్రీరెడ్డి ఫస్ట్ టైం ఆయనకు మద్దతాగా నిలిచింది. పవన్ పై వ్యతిరేకంగా మట్లాడిన అనిల్ రెడ్డిని బూతులతో కడిగిపారేసింది. దమ్ముంటే పవన్ ను విమర్శించండి.. అవసరమైతే మళ్లీ మళ్లీ విమర్శించండి.. కానీ పవన్ భార్య, పిల్లలు ఏమన్నారు..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జగనన్న పార్టీకి చెందిన వారైనా సరే ఆడవాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు.. అని శివాలెత్తింది. ఇంకోసారి ఆడోళ్లు, పిల్లల జోలికి వస్తే తొక్క తీస్తా నా కొడుకా.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ శ్రీరెడ్డి ఇంతలా ఊగిపోవడానికి కారణం ఏంటంటే..?

వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ తన భార్య పిల్లల్ని తీవ్ర స్థాయిలో ధూషిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పవన్ భార్య పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ కుమార్ నోరు పారేసుకున్నాడు. ఈ వీడియోపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వైసీపీ పై ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మినం. అయితే వైసీపీ పార్టీలో ఉన్న ఓ వెదవ జనసేన అధినేత పవన్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు. పవన్ ను తిట్టు తప్పులేదు.. కానీ ఆయన భార్య, పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు. ’ అని ఫైర్ అయింది.

Actress Sri Reddy
Actress Sri Reddy

‘జగనన్న పార్టీలో ఉన్న ఈ అనిల్ కుమార్ అనేవాడు వైసీపీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. జగన్ నా చుట్టం అంటూ… దోచుకుంటున్నాడు. కొందరు ఇలాంటి వెదవల చేష్టల వల్ల వైసీపీకి రౌడి రాజ్యం అనే పేరు వస్తోంది. అలసు వీడి స్థాయి ఏంటి..? వీడు ఎవరు..? ఆడపిల్లలు, పెళ్లాలతో నీకేం పనిరా.. నీకు దమ్ముంటే పవన్ ను తిట్టు.. కానీ ఆడాళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోను.. మరోసారి ఇలాంటి కామెంట్ చేస్తే తాట తీస్తా.. ఇలాంటి రౌడి వెదవలను జగనన్న ఎంకరేజ్ చేయడు. వీడి గురించి జగనన్నకు చేరవేయండి..’ అంటూ శ్రీరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయింది.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.
Exit mobile version