Actress Sadha: ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం చాలా దారుణంగా తయారయింది. మొన్నటిదాకా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేసి చంపుతున్నారు అంటూ చాలా కేసులు నమోదయ్యాయి. ఇక దానికి తోడుగా ఇప్పుడు కుక్కలు మనుషులను కరుస్తున్నాయి అంటూ చాలామంది చాలా రకాల కేసులను నమోదు చేస్తున్నారు… ఇండియాలో 11 సెకండ్లకు ఒక కుక్క కాటు కేసు నమోదు అవుతోంది…గత సంవత్సరం 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి అంటే కుక్కలు ఎంతలా మనుషుల మీద పగబట్టి మరి కరుస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…దీని మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది… దేశ రాజధాని అయిన ఢిల్లీలో 8 వారాల్లోగా వీధి కుక్కలు అనేవి ఉండకూడదు అంటూ ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఇక దీని మీద చాలా మంది సినిమా సెలబ్రిటీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ప్రముఖ నటి అయిన ‘ సదా’ ఈ విషయం మీద స్పందిస్తూ వీధి కుక్కల పైన ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు…ఒక రకం గా ఆ కుక్కలను చంపాలని నిర్ణయించుకున్నారు. లేదంటే సిటీలో మొత్తం 3 లక్షల కుక్కలు ఉన్నాయి. వాటన్నిటికి 8 వారాల్లోగా ఎలా షెల్టర్ కల్పిస్తారు…ఇలాంటి జడ్జిమెంట్ పాస్ చేసే ముందు వీధి కుక్కలకు రెబిస్ రాకుండా వ్యాక్సిన్స్ వేస్తే బాగుండేది కదా! నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కి లోలోపల నేను చచ్చిపోతున్నాను అంటూ ఏడుస్తూ సదా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇక ఈ విషయం మీద ఎక్కడికెళ్తే న్యాయం జరుగుతోందో అర్థం కావడం లేదు. మూగజీవులను చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు…
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
ఇలాంటి వాటికోసం జనాల్లో ఒక అవేర్నెస్ ని కలిగించి అవి కరవకుండా కుక్కలు బతకడానికి గల చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా కుక్కల్ని లేకుండా చేస్తే అసలు ఈ సమాజం ఎటు పోతోంది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది అంటూ సదా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
ఇక సదా తో పాటుగా వరుణ్ ధావన్, చిన్మయి శ్రీపాద, సోనాక్షి సిన్హా లాంటి సెలబ్రిటీలు సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తప్పుపడుతున్నారు… ఇక ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు మాత్రం మీకేంటి సెలబ్రెటీలు కార్లలో తిరుగుతూ హాయిగా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటారు. వీధి కుక్కలతో మేము పడలేకపోతున్నాము. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ముసలి వాళ్ళను, చిన్నపిల్లలను టార్గెట్ చేసి ఆ కుక్కలు కరుస్తున్నాయి.
దానివల్ల కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు… కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్ మెంట్ లో తప్పేమీ లేదు అంటూ వాళ్లు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రక్ట్ రూల్స్ ను పాటిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…