Bigg Boss Telugu 9 Promo: అన్ని బిగ్ బాస్ సీజన్స్ లాగా కాకుండా, ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తిని కలిగించడానికి బిగ్ బాస్ టీం ఈసారి అగ్నిపరీక్ష(Agnipareeksha) అనే కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టారు. దరఖాస్తుల ద్వారా వచ్చిన 18 వేల మంది సామాన్యుల నుండి కేవలం 42 మందిని ఎంపిక చేసి, వారిలో కేవలం 5 మందిని మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోకి పంపబోతున్నారు. ఆ 5 మందిని ఎంపిక చేసే బాధ్యతను బిగ్ బాస్ గత సీజన్స్ కి సంబంధించిన తోపు కంటెస్టెంట్స్ అయినటువంటి అభిజిత్(Abhijeet), నవదీప్(Navadeep) మరియు బిందు మాధవి(Bindu Madhavi) లను ఎంచుకున్నారు. గత నాలుగు రోజుల నుండి ఈ అగ్ని పరీక్ష షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా నేడు లీక్. దీంతో కాసేపటి క్రితమే ఈ అగ్నిపరీక్ష కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో ఎలా ఉందో చూద్దాం.
Also Read: అక్షరాలా 77 వేల కోట్లు..చరిత్ర తిరగరాసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల!
ముందుగా తెరమీదకు యాంకర్ శ్రీముఖి(Anchor Srimukhi) వస్తుంది. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా మంచి ఎనర్జీ తో యాంకరింగ్ చేసే శ్రీముఖి, మొట్టమొదటిసారి చాలా సీరియస్ గా, ఇంటెన్సిటీ తో మాట్లాడడం గమనార్హం. ఆమె మాట్లాడుతూ ‘మీరందరు డ్రీం చేసిన స్పాట్ లైట్..ఇదే బిగ్ బాస్ సీజన్ 9 లోకి మీ ఎంట్రీ టికెట్. కానీ ఇక్కడ స్పాట్ లైట్, అక్కడ ఎంట్రీ టికెట్ అంత తేలికైన విషయం కాదు’ అని అంటుంది. ఆ తర్వాత చదరంగం మీద నుండి క్లోజప్ షాట్ లో బిగ్ బాస్ అభిమానుల ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ వస్తాడు. ఆయన మాట్లాడుతూ ‘మీ అందరికి తెలిసి నేను మైండ్ గేమ్ ఆడుతానని, కానీ ఈసారి అగ్నిపరీక్ష లో మైండ్ బ్లాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అంటాడు’. అభిత్ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ బిందు మాధవి వస్తుంది.
ఆమె మాట్లాడుతూ ‘మాస్క్ అంటేనే ఫేక్. నా ముందు ఉండేది రెండే ఆప్షన్స్, బ్లాకా?, వైటా?, ఈ అగ్నిపరీక్ష అది తేల్చేద్దామ్’ అని అంటుంది. ఇక చివర్లో బిగ్ బాస్ సీజన్ 1 లో ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నవదీప్ వస్తాడు. ఆయన మాట్లాడుతూ ‘ఏంటి సీరియస్ అవుతున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉండదని అనుకుంటున్నారా?, నేను ఉన్నాను కదా, ఈ అగ్నిపరీక్ష లో మీ స్ట్రెస్ ఎలా తగ్గించాలో, వాళ్లకి ఎలా పెంచాలో నేను చూసుకుంటాను’ అంటూ చెప్పుకొస్తాడు. ఇక చివర్లో ఈ ముగ్గురు శ్రీముఖి తో కలిసి వస్తారు, వీళ్ళ వెనుక 42 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ 42 మంది ఎవరు, చివరికి ఎవరెవరు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు అనేది తెలియాలంటే ఆగష్టు 22 వరకు ఆగాల్సిందే. జియో హాట్ స్టార్ లో మాత్రమే ఈ అగ్నిపరీక్ష సిరీస్ టెలికాస్ట్ కానుంది.
