Akkineni Nagarjuna Cries: టాలీవుడ్ లో చాలా కూల్ యాటిట్యూడ్ తో ఉండే హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna). ఆయన ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాంటి టెన్షన్స్ ఆయనకు ఉండవు. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అని అడిగితే, వర్కౌట్స్ చేయడం, ఏ విషయాన్ని కూడా సీరియస్ గా తలకి ఎక్కించుకొని బాధ పడను అనడం మనం ఎన్నో ఇంటర్వ్యూస్ లో చూశాము. సినిమాల్లో కాకుండా నాగార్జున ని బయట మనం ఎక్కడైనా కోపంగా చూశామా అంటే, అది బిగ్ బాస్ షోలో మాత్రమే. ఈ ఒక్క షోలోనే నాగార్జున అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ పై కోపం చూపిస్తుంటాడు. ఎక్కువ శాతం ఇక్కడ కూడా చిరు నవ్వుతోనే అందరినీ పలకరిస్తూ ఉంటాడు. అలాంటి నాగార్జున కన్నీళ్లు పెట్టుకొని ఏడవడం ఎప్పుడైనా చూసారా?.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
ఆయన ఎంతగానో ప్రేమించే తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు గారు చనిపోయినప్పుడు మాత్రమే నాగార్జున ని కన్నీళ్లతో మనం చూశాము. ప్రతీసారి ఆయన్ని తల్చుకున్నప్పుడే నాగార్జున ఎమోషనల్ అవుతూ ఉంటాడు. రీసెంట్ గా కూడా ఆయన విషయం లోనే ఎమోషనల్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే సీనియర్ హీరో జగపతి బాబు వ్యాఖ్యాతగా జీ తెలుగు ఛానల్ లో ‘జయమ్ము నిశ్చయమ్ము’ అనే ప్రోగ్రాం రేపటి నుండి ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథి గా అక్కినేని నాగార్జున వస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో నిన్ననే విడుదలైంది. మొదటి ప్రోమో చాలా ఫన్నీ గా సాగిపోయింది. కానీ ఆ తర్వాత కాసేపటికి రెండవ ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో మాత్రం నాగార్జున చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే తన తండ్రి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి.
నాగేశ్వర రావు గారికి కొడుకుగా పుట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని జగపతి బాబు నాగార్జున ని అడగ్గా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘అంత ఈజీ కాదు..ఎదో ఏఎన్నార్ గారి కొడుకు అనుకుంటున్నావేమో’ అని అంటాడు. దానికి కొనసాగింపు రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే. నా సోదరుడు వెంకట్ ‘తమ్ముడు నువ్వు ఎందుకు సినిమాల్లోకి రాకూడదు?’ అని అడిగాడు, అప్పుడు ‘ఎస్..కచ్చితంగా చేద్దాం’ అని అన్నాను, ఆ తర్వాత నాన్న గారి దగ్గరకి వెళ్లి కూర్చొని ‘ఇలా సినిమాల్లోకి వద్దామని అనుకుంటున్నాను’ అని చెప్పాను, అప్పుడు నాన్న గారి కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. అన్నమయ్య సినిమా చూసి నా చేతులు పట్టుకొని ఆయన మాట్లాడిన మాటలు, ఈ జీవితానికి ఇది చాలు సాధించడం అని అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. మధ్యలో ఆయన చివరి రోజులను తల్చుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఈ ప్రోమో వీడియో ని మీరు కూడా చూసేయండి.
