Tribanadhari Barbarik Trailer Review: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులైతే వచ్చాయి…రొటీన్ కథలను కాకుండా మంచి స్టోరీస్ ను ఎంచుకొని సినిమాలను చేస్తు సూపర్ సక్సెస్ సంసాదించే దిశగా ముందుకు సాగుతున్నారు…ప్రస్తుతం జరిగే కథకి పురాణాలను జోడించి దానికి దీనికి ఇంటర్ లింక్ చేస్తూ కథను రాస్తున్న విధానం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి’ సినిమాలో చిరంజీవి అయిన అశ్వద్ధామ కి ఫ్యూచర్లో చెరిగిపోయే కథకి చాలా మంచి కనెక్టివిటిని సెట్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద భారీ ఇంపాక్ట్ రావడమే కాకుండా సినిమా మొత్తం ఒక మంచి హై ఫీల్ అయితే ఇచ్చింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆశ్చర్యానికి గురిచేసింది…ఇక ఇప్పుడు అలాంటి పురాణ కథలను కలుపుతూ ‘త్రిబాణా దారి భార్భరిక్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక కురుక్షేత్రంలో బార్బరికుడు యుద్ధం చేయనప్పటికి శ్రీకృష్ణుడు ఆయన తలని చాలా ఎత్తైన కొండమీద పెట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని చూడమని చెబుతాడు. అందరికంటే బలవంతుడైన భార్భరికుడు తనకు కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించడానికి ఎంత సమయం కావాలి అని కృష్ణుడు అడిగిన ప్రశ్నకి ఆయనకు కేవలం మూడు నిమిషాలు చాలని సమాధానం చెబుతాడు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
అయితే యుద్ధం లో ఎవరి సైన్యం అయితే బలహీనంగా ఉంటుందో వల్ల వైపు ఆయన యుద్ధం చేస్తానని చెప్తాడు.దాంతో శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి అతని వల్ల కురుక్షేత్ర యుద్ధంలో బలహీనుడు బలవంతుడుగా మారుతాడు. కాబట్టి ఇతను యుద్ధం చేస్తే కురుక్షేత్ర యుద్ధం ఎప్పటికీ ముగిసిపోదు అని ఆలోచించి శ్రీకృష్ణుడు బార్బరికుడితో నీ తలని తీసి ఇవ్వమని చెబుతాడు. దాంతో భార్భరికుడు అలానే చేస్తావు.
ఇక ఆ తలని తీసుకెళ్లి పాండవులు ఎత్తైన కొండ మీద పెట్టి అతను యుద్ధాన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేస్తారు. మరి ఏది ఏమైనా కూడా అలాంటి ఒక భార్భరికుడి కథని ఇంటర్ లింక్ చేస్తూ ఈ జనరేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని తనైతే ఎలా ఫేస్ చేస్తాడు అనే ఒక ఫిక్షన్ స్టోరీని రాసుకొని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే భార్భరికుడి కథ ఆధారంగానే ఈ సినిమా ముందుకు సాగిపోతోంది.
కృష్ణుడు భార్భరికుడు చెప్పిన ఉపదేశాన్ని ఉద్దేశించి ఈ సినిమా ముందుకు రన్ అవ్వబోతోంది. మరి ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ట్రైలర్లో పెద్దగా బార్బరికుడిని ఎలివేట్ చేసినట్టుగా అనిపించలేదు. కానీ కథలో ఉన్న కాన్ఫిట్ ని మాత్రం ప్రేక్షకులకు తెలియజేశారు. మరి ఆ కాన్ఫిట్ ని ఈ భార్భరికుడి ఎపిసోడ్ కి ఎలా కనెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీదనే ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది…
ట్రైలర్ ను చూస్తుంటే ఇది సినిమాలా అనిపించలేదు ఏదో ఒక షార్ట్ ఫిలిం చూసినట్టుగా అనిపించింది. ఇక విజువల్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మ్యూజిక్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది…మొత్తానికైతే భర్భారికుడి కథ ఆధారంగా సినిమా వస్తుందని ప్రేక్షకులకు తెలియజేసింది. కానీ దానికి తగ్గట్టుగా దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ్ ప్రేక్షకులను స్క్రీన్ మీద అంత బాగా ఎంగేజ్ చేయలేకపోయాడు. మరి ట్రైలర్ లోనే చెప్పిన పాయింట్ ప్రేక్షకుడికి కన్వే అవ్వలేకపోయింది. మరి సినిమాలో అయిన దానిని ఎఫెక్ట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
