Pawan Kalyan : పవన్ పై స్పెషల్ AV వీడియో.. చూస్తే గూస్ బాంబ్సే

Pawan Kalyan పవన్ కళ్యాణ్ కు ఈసారి సినీ పరిశ్రమ నుంచి ఆదరణ గణనీయంగా పెరిగింది. జనసేన ఏర్పాటు చేసినప్పుడు సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

Written By: NARESH, Updated On : June 24, 2024 9:15 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan : రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్. జాతీయస్థాయిలో సైతం తన స్టామినా చాటి చెప్పారు పవన్. వైసీపీని పాతాళానికి తొక్కేస్తానని శపధం చేశారు. అలాగే చేసి చూపించారు.ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ఎంతగానో దోహదపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఏపీ కీలకంగా మారింది. అందుకే ఇప్పుడు పవన్ పేరు జాతీయస్థాయిలో సైతం మార్మోగింది. ఆయన పార్టీ 2 పార్లమెంట్ స్థానాలనే గెలిచినా.. పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రధాని మోదీ కీర్తించేదాకా పరిస్థితి వచ్చింది. అయితే పవన్ సాధించిన విజయం వెనక ఎంతో కృషి ఉంది. అన్నింటికీ మించి వ్యక్తిగత అవమానాలు, ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు పవన్. అందుకే ఈ విజయం సాధించిన తర్వాత పవన్ స్టామినా ఈ లోకానికి తెలిసింది. క్రేజ్ విపరీతంగా పెరిగింది.

పవన్ కళ్యాణ్ క్రేజ్ రాజకీయాలకు అతీతంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా జనసేన విజయాన్ని సినీ పరిశ్రమ ఆస్వాదిస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వ ప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ప్రదర్శించిన స్పెషల్ ఏవి ఆకట్టుకుంది. గత పది సంవత్సరాలుగా ఎన్నో అవమానాలను, విమర్శలను ఎదుర్కొని పవన్ ఘన విజయం సాధించారని కొనియాడారు. అయితే వీడియోలో పొందుపరిచిన అంశాలు, అందులోని దృశ్యాలు చూసి పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇది కదా పవన్ స్టామినా అంటూ ఆ దృశ్యాలను వైరల్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు ఈసారి సినీ పరిశ్రమ నుంచి ఆదరణ గణనీయంగా పెరిగింది. జనసేన ఏర్పాటు చేసినప్పుడు సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అప్పటికే ప్రజారాజ్యం తెరపైకి వచ్చి.. కాంగ్రెస్లో విలీనం కావడంతో జనసేన ను అంతా లైట్ తీసుకున్నారు. కానీ పవన్ మాత్రం ఎన్నడు సినీ పరిశ్రమ మద్దతు కోరలేదు. తనకు మద్దతుగా నిలవాలని ఎన్నడూ విజ్ఞప్తి చేయలేదు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా.. తన పని తాను చేసుకున్నారే తప్ప.. రాజకీయాల్లోకి సినీ పరిశ్రమను లాగలేదు. అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమే. దాని నుంచి గుణపాటాలు నేర్చుకున్న సినీ పరిశ్రమ వ్యక్తులు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో పవన్ కూటమి గెలుపునకు దోహదపడ్డారు. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధించారు. అయితే ఇది సినీ పరిశ్రమకు దక్కిన గౌరవంగా అంతా భావిస్తున్నారు. అందుకే కూటమి గెలుపును తమ గెలుపుగా భావించి సినీ పరిశ్రమ వ్యక్తులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.