Gautam Adani : భారతీయ కుబేరుడు అదానీ జీతం ఎంతో తెలుసా?

Gautam Adani : ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 114 బిలియన్ డాలర్ల రూ.( 95,26,17,63,00,000) ఆస్తులతో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు.

Written By: NARESH, Updated On : June 24, 2024 9:09 am

Gautam Adani

Follow us on

Gautam Adani : భారతదేశంలో ముఖేష్ అంబానీ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న అదానీ గురించి నిత్యం ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. ఇటీవల ఆయన ఆసియా కుబేరుల జాబితాలో 14వ స్థానంలో నిలిచిన అదానీ అంతకంతకు ఆదాయాన్ని పెంచుకుంటూ దేశంలో నెంబర్ వన్ గా ఉన్న అంబానీ స్థానాన్ని బీట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అదానీ చేసిన సేవలకు మిగతా ప్రముఖ వ్యాపారుల కంటే కంటే తక్కువే జీతం తీసుకుంటున్నాడు. ఇంతకీ అ దానీ వార్షిక ఆదాయం ఎంతో ఒకసారి చూద్దాం..

భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ రూ.9.26 కోట్ల మొత్తాన్ని వేతనంగా తీసుకున్నారు. ఇది అపార కుభేరుడైన ముఖేష్ అంబానీ కంటే తక్కువ. ముఖేష్ అంబానీ జీతం ఒకప్పుడు జీతం సంవత్సరానికి రూ. 15 కోట్లుగా ఉంది. అయితే కరోనాకాలం తర్వాత నుంచి ఆయన జీవితం అందుకోవడం లేదు. ఎయిర్ టెల్ సంస్థ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ 2022-23లో రూ. 16.7 కోట్లు అందుకున్నారు. బజాజ్ ఆటో సీఈ రాజీవ్ బజాజ్ రూ.33,7 కోట్లు తీసుకున్నారు. హీరో మోటోకార్ప్ బోర్డు డైరెక్టర్ పవన్ ముంజాల్ రూ. 50 కోట్లు అందుకున్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్, ఇన్ఫోసిస్ సీఈఓ పరేఖ్ కంటే కూడా ఆదానీ జీతం తక్కువగా ఉంది.

10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల వార్షిక నివేదికల ప్రకారం.. ఆదానీ ఫోర్డ్స్- టు-ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న 10 గ్రూప్ సంస్థలలో కేవలం రెండింటి నుంచి మాత్రమే 9.26 కోట్ల మొత్తాన్ని జీతంగా తీసుకుంటున్నారు. ఈ గ్రూపులో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2023-24లో జీతం రూపంలో రూ.2,19 కోట్లు, ప్రయోజనాలు, ఇతర అలవెన్సులుగా రూ.27 లక్షలు అందుకున్నారు. వార్షిక నివేదిక ప్రకారం ఆయన మొత్తం జీతం రూ.2.46 కోట్లు మునుపటి ఆర్థిక సంవత్సరం 2022-23 కంటే మూడు శాతం ఎక్కువ. వీటితోపాటు పోర్ట్స్, లిమిటెడ్ నుంచి 6.3 కోట్ల రూపాయల జీతం అందుకున్నారు.

బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ నికర సంపద విలువ 106 బిలియన్ డాలర్లు రూ. 86,5767,27,00,0001. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచేందుకు అంబానీతో పోటీపడుతున్నారు. అత్యంత ధనవంతుడిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూసి షార్ట్ సెల్లర్ హిండెనర్ రీసెన్స్ నివేదిక తర్వాత ఆయన గ్రూప్ కంపెనీలలో పేర్ల విలువ గత సంవత్సరం 150 బిలియన్ డాలర్లు పడిపోయింది. అయినా ఈ సంవత్సరం ముఖేష్ అంబానీ అదా అని రెండుసార్లు బీట్ చేశారు. ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 114 బిలియన్ డాలర్ల రూ.( 95,26,17,63,00,000) ఆస్తులతో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాలో అదానీ 14వ స్థానంలో నిలిచారు. వార్షిక నివేదిక ప్రకారం.. ఆదానీ తమ్ముడు రాజేష్ ఏఈఎల్ నుంచి రూ.1.71 కోట్ల కమీషన్ లాభాలతో సహా రూ.8.37 కోట్లు అందుకున్నారు. కాగా, ఆయన మేనల్లుడు ప్రణబ్ అదానీ కమీషన్ రూ.4.5 కోట్లు ఉంది.