Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ లో తను గేమ్ చేంజర్ గా మారడమే కాకుండా ఇటు స్టేట్ లోను, అటు సెంట్రల్ లోను రెండు పార్టీలు గెలవడానికి తను కీలకమైన వ్యక్తిగా మారాడు. ఇక ప్రస్తుతం ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయాన్ని మార్చే ఒక శక్తిగా ఎదిగాడనే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకోగల పవర్ అయితే ఉంది.
ఇక అలాగే మోడీతో ఏ విషయంలో అయినా సరే డైరెక్ట్ గా మాట్లాడి డీల్ కుదిర్చే అంత చనువు ఆయనకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనను మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో గాని, సినిమాల్లో గాని ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీతో పాటు స్పెండ్ చేయాల్సిన టైం మాత్రం వాళ్లతో పక్కాగా స్పెండ్ చేస్తూ ఉంటాడు.
ఇక అందులో భాగంగానే ఈరోజు తన భార్య అయిన ‘అన్న లేజొనోవా’ తన కొడుకు ‘అకీరా నందన్’ కూతురు ‘అద్యా’ లతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఇక ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది. ఇక ‘పిక్ ఆఫ్ ది డే’ గా కూడా ఈ ఫోటో నిలిచిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో అసెంబ్లీలో అదరగొడుతున్నాడు.
ఇక రీసెంట్ గా అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అసెంబ్లీ కి హాజరవుతూ అక్కడ తను చేయబోయే కార్యక్రమాల గురించి తమ పార్టీ మెంబర్స్ తో గాని ఎన్డీఏ కూటమి నాయకులతో గాని చర్చిస్తున్నాడు…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ను కాబోయే ఆంధ్ర సీఎంగా అభి వర్ణించడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…