ఎంటర్టైన్మెంట్Mahesh-Rajamouli Movie: 1500 కోట్ల రూపాయిల బడ్జెట్..ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్..మహేష్- రాజమౌళి ప్రాజెక్ట్...

Mahesh-Rajamouli Movie: 1500 కోట్ల రూపాయిల బడ్జెట్..ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్..మహేష్- రాజమౌళి ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్!

Mahesh-Rajamouli Movie: అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన కాంబినేషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే వెయ్యి రూపాయిలు టికెట్ పెట్టి పోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక ఒక సినిమా వస్తుందని పదేళ్ల క్రితమే తెలుసు, కానీ ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ అవ్వడం వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు బాహుబలి సిరీస్ మరియు #RRR చిత్రం ద్వారా రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ వచ్చింది. ఆయన సినిమాలు ఇక హాలీవుడ్ మూవీస్ తో పోటీ పడుతాయి. ఆ స్థాయికి చేరుకున్న సమయం లో మహేష్ తగిలాడు. స్టార్ డైరెక్టర్స్ మరియు టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే కలెక్షన్స్ ని కొల్లగొట్టే మహేష్ బాబు, రాజమౌళి లాంటి డైరెక్టర్ తో జతకడితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే అన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే ఈ ప్రాజెక్ట్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో తీర్చి దిద్దబోతున్నాడట రాజమౌళి. ఇటీవలే ఫ్యామిలీ తో కలిసి టూర్ కి వెళ్లి చిల్ అయిన రాజమౌళి , ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ని ఏర్పాటు చేసే పనిలో పడ్డాడట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇది వరకే అమిర్ ఖాన్ పేరు మనకి బాగా వినిపించింది.దీనిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు, కానీ ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్ అయితే కచ్చితంగా ఉన్నారట.

హీరోయిన్ కూడా బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళే అని తెలుస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని సుమారుగా 1500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడట. ఇది ఇండియా లో హైయెస్ట్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాడు అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Rajamouli: రాజమౌళి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్…

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆయనతో సినిమా చేసిన తర్వాత ఆయా హీరోలు స్టార్ హీరోలుగా మారిపోతున్నారు. ఇక...

Rajamouli: రాజమౌళి ఆ ఇద్దరు హీరోలను షూటింగ్ స్పాట్ లోనే కొట్టాడు…కారణం ఇదే…

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తుంది. ప్రేక్షకులందరు మొదటి రోజు అతని సినిమాను చూసి కాలర్ ఎగిరేసుకుని మరి బయటికి వచ్చేలా అతని సినిమాలైతే ఉంటాయి....

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...