తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 30వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఏమిటంటే..?
2021 – 2022 సంవత్సరానికి అప్రెంటిస్ షిప్ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ ట్రేడులు పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐదులో చేరితే పీజీ వరకు ఫ్రీ..!
అప్రెంటిస్ షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్ రీజినల్ లో 12 డిపోలలో శిక్షణ ఇస్తారు. ఐటీఐ పాసైన అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన అప్రెంటీస్ షిప్ ఉద్యోగలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంతమంది అభ్యర్థులకు ఎంపిక చేస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ఐటీఐ పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వూలు లేవు కాబట్టి మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులు కచ్చితంగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి.