https://oktelugu.com/

‘మైక్ పట్టుకో’ అను నీ యబ్బ.. మీడియాపై బాలయ్య చిందులు

అసలే ఆయన బాలయ్య.. కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేడు. చెంప చెల్లుమనేలా వాయిస్తాడు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తిట్టేస్తాడు. అవసరమైతే కొట్టేస్తాడు. ఇలా చాలా సార్లు చేశాడు. కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. ఇప్పుడు కూడా అంతే.. మరోసారి మీడియాపై చిందులు తొక్కాడు. బాలకృష్ట సినిమాల్లో ఎంత ఫైర్ గా ఉంటాడో.. బయట కూడా అంతే ఫైర్ ఈజ్ ద ఫైర్ గా ఉంటాడు. ఇప్పటికే బాలయ్య తన అభిమానులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2021 / 06:38 PM IST
    Follow us on

    అసలే ఆయన బాలయ్య.. కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేడు. చెంప చెల్లుమనేలా వాయిస్తాడు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తిట్టేస్తాడు. అవసరమైతే కొట్టేస్తాడు. ఇలా చాలా సార్లు చేశాడు. కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. ఇప్పుడు కూడా అంతే.. మరోసారి మీడియాపై చిందులు తొక్కాడు.

    బాలకృష్ట సినిమాల్లో ఎంత ఫైర్ గా ఉంటాడో.. బయట కూడా అంతే ఫైర్ ఈజ్ ద ఫైర్ గా ఉంటాడు. ఇప్పటికే బాలయ్య తన అభిమానులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఇదివరకే చాలా సార్లు బయటికి వచ్చాయి.

    తాజాగా బాలక్రిష్ణ నాన్నగారు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు 25 వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలయ్య నివాళులర్పించారు. అయితే కవరేజ్ కోసం చాలా ఛానల్స్ పోటీపడ్డాయి. దీంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. మైక్ పెట్టు మైక్ పెట్టు తమ్ముడూ అని ఓ మీడియా ప్రతినిధి అనడంతో ఎక్కడా మైక్ పెట్టు కాదు ‘మైక్ పట్టుకో’ అను నీ యబ్బ అంటూ బాలక్రిష్ణ సీరియస్ అయ్యారు.

    కొంచెం ముందుకు రండి సార్ కొంచెం వెనక్కి వెళ్లండి సార్ అని మీడియా సిబ్బంది హడావిడి చేయడంతో మీ సలహాలు చాలు.. సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో ఉచ్చపోసే రకాలు మీరు అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు బాలయ్య.