Rajkumari Ratnavati Girls School: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ ప్రాంతంలో రాజకుమారి రత్నావతి పేరుతో ఒక బాలికల పాఠశాల ఉంది. ఈ పాఠశాల లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు చల్లగానే ఉంటుంది. అయితే ఈ పాఠశాలలో కిండర్ గార్డెన్ నుంచి పదవ తరగతి వరకు 400 మంది వరకు బాలికలు చదువుతున్నారు.. వారికి ఇక్కడ వసతి కల్పించడానికి ప్రత్యేకమైన గదులు నిర్మించారు. కేవలం పాఠాలు మాత్రమే కాకుండా సృజనాత్మకత, ఎంబ్రాయిడరీ వంటి వాటిల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఈ పాఠశాల సిఐటిటిఏ యాజమాన్యంలో కొనసాగుతోంది. అయితే ఈ పాఠశాలలో ఫ్యాన్లు ఉండవు. ఏసీలు అంతకన్నా ఉండవు. ఎడారిలో కట్టిన ఈ భవనం పైన సౌర ఫలకలు ఉన్నాయి. వీటి ద్వారానే పాఠశాలకు అవసరమైన విద్యుత్తు తయారీ అవుతుంది. అయితే ఎడారిలో.. విపరీతమైన ఎండలో కట్టిన ఈ భవనం చల్లగా ఉంటుంది. 50 డిగ్రీల ఎండలోనూ ఫ్యాన్లు, ఏసీలు లేకుండానే శీతలంగా ఉంటుంది.
Also Read: గుజరాత్ ను ఓడించడానికి.. ముంబై మోసం చేసిందా? వెలుగులోకి సంచలన నిజం
ఈ పాఠశాల భవనాన్ని డయానా కెల్లాగ్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ నిర్మించింది.. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సామ్ నగరంలో పశ్చిమాన ఉంది. ఇసుక దిబ్బలకు దగ్గర్లో ఈ పాఠశాల నిర్మించారు. ఈ పాఠశాల కనోయి అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది. ఎడారి మధ్యలో ఈ భవనాన్ని ఓవల్ ఆకారంలో నిర్మించారు. ఓవల్ ఆకారంలో నిర్మించడం వల్ల ఎండను తట్టుకుంటుంది. పైగా చల్లని వాతావరణాన్ని అందిస్తుంది. పాఠశాల లోపలి గోడలపై సున్నపు ప్లాస్టర్ ఉపయోగించారు. సున్నపు ప్లాస్టర్ ఉపయోగించడం వల్ల అది గోడలను చల్లగా ఉంచుతుంది. సున్నపు ప్లాస్టర్లో పోరస్ అనే పదార్థం ఉంటుంది. దీని డిజైన్ లో జాలి గోడ ఉంది. ఇది గాలిని త్వరగా ప్రసరించేలా చేస్తుంది. ఇది ఇసుకరాయి గ్రిడ్ ను పోలి ఉంటుంది. ఇసుకరాయితో నిర్మించడం వల్ల ఇది చల్లగా ఉంటుంది. ఈ పాఠశాలను మూడు అంతస్తులలో కట్టారు. విశాలమంతమైన హాలు, లైబ్రరీ, మ్యూజియం ఇందులో ఉన్నాయి. పైగా ఈ భవనంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి గుంతలు కూడా ఏర్పాటు చేశారు. భూగర్భ జలాలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. డ్రైనేజీ నీటిని శుద్ధిచేసి.. వాటిని వాడుకుంటున్నారు. ఈ పాఠశాలలో చదువుకునే పిల్లల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఈ పాఠశాల నిర్వహణ అద్భుతంగా నేపథ్యంలో 2020లో ఏడీ 100 పురస్కారం అందుకుంది. ఆర్కిటెక్చర్ డైజెస్ట్ అనే సంస్థ కూడా ఈ పాఠశాల యాజమాన్యానికి పురస్కారాన్ని అందించింది.