MI Vs GT Eliminator 2025: ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నప్పుడు ముంబై ఆటగాళ్ల ముఖంలో విపరీతమైన ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. మరో కీలక ఆటగాడు రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ లోనూ తీవ్రమైన ఒత్తిడిలో కనిపించాడు. ఈ క్రమంలో గుజరాత్ జట్టు విజయం సాధిస్తుంది అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటిదాకా నిలబడిన గుజరాత్ ఆటగాళ్లు తడబడ్డారు. ముఖ్యంగా అర్థ శతకం ముందు వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మరో ఆటగాడు సాయి సుదర్శన్ కూడా దారుణమైన షాట్ ఆడి వికెట్ పోగొట్టుకున్నాడు. దీంతో ముంబై జట్టు మ్యాచ్ మీద ఒక్కసారిగా ప్రదర్శించింది.
Also Read: ముంబైకి అచ్చిరాని అహ్మదాబాద్..ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలుస్తుందా?
వాస్తవానికి వాషింగ్టన్ సుందర్, సాయి మైదానంలో ఉన్నప్పుడు దుమ్ము రేపారు. పరుగుల వరద పారించారు. అయితే వారిద్దరూ మైదానంలో ఉన్నప్పుడు సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారిగా హై డ్రామాకు తెర లేపాడు. సుదర్శన్, సుందర్ ఏకాగ్రతను దెబ్బ కొట్టడానికి అతడు నడుము నొప్పితో బాధపడినట్టు మైదానంలో పడుకుని ఉండిపోయాడు. దీంతో ఫిజియోలు వచ్చి అతనికి చికిత్స చేశారు. ఫలితంగా మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఇక ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి సందేశం వచ్చింది.. బుమ్రా చేతిలోకి బంతి వెళ్ళిపోయింది. ఇక అప్పుడే బుమ్రా అద్భుతమైన యార్కర్ వేసి సుందర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తద్వారా మూడో వికెట్ కు అప్పటివరకు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ తర్వాత సాయి కూడా అవుట్ కావడంతో గుజరాత్ జట్టుకు పరాజయం తప్పలేదు.
అయితే కీలక సమయంలో ఆట మూమెంట్ మొత్తాన్ని బ్రేక్ చేయడానికి.. ప్లేయర్లు ఇంజురీ డ్రామా ఆడడం ఇటీవల కాలంలో సాధారణమైపోయింది. 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో గాయమైనట్టు డ్రామా ఆడాడు. ఆ తర్వాత మ్యాచ్ మొత్తాన్ని ఇండియా వైపు అతడు టర్న్ చేశాడు. ఇక నాటి నుంచి చాలామంది పంత్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఇటువంటి డ్రామాలు క్రీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని మాజీ క్రికెటర్లు అని భయపడుతున్నారు. ఇలాంటి డ్రామాలు ఆడకుండా నిబంధనలను అత్యంత కఠినతరం చేయాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ సీజన్ తర్వాత ఆటగాళ్ల ఇంజురీపై కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనతి కాలంలోనే ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియా కధనాలలో పేర్కొంటున్నది.